SSMB 29: అదుర్స్ అప్డేట్.. రాజమౌళిలో ఈ ఛేంజ్.. అస్సలు ఊహించలేదుగా..!

కేవలం టాలీవుడ్ ఆడియన్సే కాదు.. పాన్ ఇండియా లెవెల్ సినీ ప్రేక్ష‌కులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న.. మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29. పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ.. రాజమౌళి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాయి ఈ సినిమాలో.. మహేష్ బాబు హీరోగా మెరవనున్నాడు. యాక్షన్, అడ్వెంచర్స్, ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందట. ఇక.. ఇప్పటికే సినిమా పై ఆదియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటూ అఫీషియల్ ప్రకటన మొదలైనప్పటి నుంచి.. ఫ్యాన్స్ లో సినిమా అప్డేట్లపై ఆసక్తి నెల‌కొంది. సినిమాకు సంబంధించిన ఏ చిన్న లీక్ బయటకు వచ్చిన చాలు తెగ మురిసిపోతూ దాన్ని ట్రెండ్ చేసేస్తున్నారు అభిమానులు.

కానీ.. రాజమౌళి మాత్రం ఓ సినిమా చేస్తున్నాడంటే షూటింగ్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో.. ఎలాంటి పగడ్బందీ ప్లాన్స్ చేస్తారో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో భాగంగానే మహేష్ సినిమాని సైతం చాలా సీక్రెట్ గా.. నిశ్శబ్దంగా షూట్ ను ముగిస్తున్నాడు. సినిమా నుంచి కనీసం ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఇలాంటి క్రమంలో.. తాజాగా సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ రివిల్ అయింది. అది కూడా ఇప్పటివరకు ప్రాజెక్టును హైడ్ చేస్తూ వచ్చిన రాజమౌళినే స్వయంగా తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ కు బిగ్ షాక్‌.

ఇక.. రాజమౌళి తన పోస్ట్‌లో ఈ విధంగా రాసుకొచ్చాడు. సినిమాలోని మూడు ప్రధాన పాత్రలతో ప్రస్తుతం ఆ క్లైమాక్స్ కొనసాగుతుందని.. మరోవైపు గ్లోబల్ థియేటర్ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇంతకుముందు ఎన్నడు తన సినిమా షూటింగ్‌ల‌కు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా బయటకు రాకుండా దాచిన రాజమౌళి.. సినిమాకు సంబంధించిన ఇంత ఇంపార్టెంట్ అప్డేట్‌ను సోషల్ మీడియా వేదికగా పర్సనల్ గా షేర్ చేసుకోవడం.. జ‌క్క‌న‌లో ఈ స‌డ‌న్ ఛేంజ్‌ ఆడియన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.

SSMB29 — Pritviraj as Kumbha : r/tollywood

ఇక మరోవైపు.. గ్లోబల్ థియేటర్ కోసం ఏర్పాట్లు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయని.. నవంబర్ 15 న ప్రతి ఒక్కరు ఈ ఈవెంట్‌ను చాలా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా.. నేను ఆ రోజు కోసం ఎంతో ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్న.. మీరు కూడా అలాగే ఎదురుచూస్తున్నారని నమ్ముతున్నా. అంతవరకు మీరు ఈ ఎక్సైజ్మెంట్ను కొనసాగించేందుకు ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తా.. సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చేసిన కొంతసేపటికి పృథ్వీరాజ్ లుక్ ను సైతం రాజమౌళి రివీల్‌ చేశాడు. ఈ క్రమంలోనే రాజమౌళి పోస్ట్ తో పాటు.. పృథ్వీరాజ్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అసలు రాజమౌళి తన సినిమా అప్డేట్ను ఇవ్వడమే చాలా రేర్ అలాంటిది.. షూట్ అప్డేట్ తో పాటు.. క్యారెక్టర్ లుక్ రివీల్ చేయడంతో ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నెలకొంది.