ఒకప్పటి టాలీవుడ్ స్టార్ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆడియన్స్ లో పరిచయాలు అవసరం లేదు. ఇక ఈ అమ్మడు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు.. కొన్ని సాంఘిక సమస్యలపై కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే అమ్మడికి మంచి పాపులారిటీ ఏర్పడింది. అయితే.. చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్ ను పట్టించుకోరు. కానీ రేణు దేశాయ్ అలా కాదు తనపై ఏదైనా ట్రోల్ జరిగిందంటే వెంటనే తన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఇక.. గతంలో ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉన్న ఈ అమ్మడు.. ఈ నెగెటివిటీని తట్టుకోలేక అకౌంట్ డిలీట్ చేసి.. కేవలం ఇన్‌స్టాలో మాత్రమే సందడి చేస్తుంది.
ఇప్పటికీ.. అభిమానులతో టచ్‌లో ఉంటుంది. కాగా.. రేణు దేశామ్ని చూడగానే పవన్ అభిమానులందరికీ గుర్తొచ్చే పదం వదినా. ఇప్పటికే ఆమెను చాలా మంది వదిన అని పిలుస్తూ ఉంటారు. కానీ.. ఈ పిలుపు ఆమెకు అసలు నచ్చదట.. అభిమానులు ఇలా పిలిచినా ఎన్నోసార్లు ఇన్‌స్టా వేదికగా ఆమె మండిపడింది. పవన్ తో విడిపోయిన తర్వాత నేను వదిన ఎలా అవుతా.. పిలిస్తే అక్క అని పిలవండి.. లేదంటే రేణు అని పిలవండి అంటూ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సెలబ్రిటీలకు కూడా ఈమె ఇలానే చెబుతుందట.
తాజాగా.. ఓ ఈవెంట్లో ఇది రుజువైంది. ఫంక్షన్‌కు హాజరైన రేణు దేశాయ్.. అదే ఈవెంట్‌కు వచ్చిన జానీ మాస్టర్‌తో చేసిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. జానీ మాస్టర్ ముందు ఈవెంట్ కి వచ్చి అక్కడ ఉన్న యాంకర్ అనసూయ ను పలకరించి.. తర్వాత పక్కనే ఉన్న రేణుని చూసి వదినా హాయ్ అన్నాడు.. అప్పుడు రేణు దేశాయ్ వదిన కాదు అక్క ఎన్ని సార్లు చెప్పాలి రా నీకు అంటూ కామెంట్ చేసింది. దానికి జానీ మాస్టర్ పొరపాటున నోటి నుండి వచ్చేసిందని రియాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ వీడియో వైరల్ గా మారుతుంది. కాగా.. ఇప్పటివరకు రేణు దేశాయ్ ఇదే విషయాన్ని ఎన్నో సార్లు చెప్పినా.. ఫ్యాన్స్ మాత్రం సహజంగానే ఆమెను వదిన అని పిలిచేస్తుంటారు. అదే మళ్లీ రిపీట్ అయింది. ఈ క్రమంలోనే.. వీడియో వైరల్ అవ్వడంతో ప్రతిసారి రేణు ఎంత చెప్పినా ఉపయోగం ఉండదని.. ఆటోమేటిక్‌గా.. ఆమెని చూడగానే అదే పదం గుర్తొస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
View this post on Instagram


