టాలీవుడ్ మాస్ మహారాజా లేటెస్ట్ మూవీ మాస్ జాతర. భాను భోగవరపు డైరెక్షన్లో సూర్యదేవర నాగు వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 1 న అంటే కొద్దిసేపటి క్రితం గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే.. సినిమా పలుచోట్ల ప్రీమియర్ షోలు ముగించుకుంది. రవితేజ కెరీర్లో కాకి చొక్కా వేయడం కొత్తేమి కాదు. క్రాక్, పవర్, విక్రమార్కుడు ఇలా ఎన్నో సినిమాల్లో ఇప్పటికే పోలీస్‌గా కనిపించిన రవితేజ.. మాస్ జాతర కోసం.. మరోసారి రైల్వే పోలీస్ గా మారాడు. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుందా.. లేదా.. నిజంగానే జాతర రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కు అందిందా.. ఒకసారి రివ్యూ లో చూద్దాం.
స్టోరీ
లక్ష్మణ్ బేరి (రవితేజ) నిజాయితీగలవో రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఉంటాడు. తన కళ్ళ ఎదురుగా జరిగిన అన్యాయం ఏదైనా.. అది తన పరిధిలోది లేకపోయినా.. తన ఆధీనంలోకి తెచ్చుకొని మరి న్యాయం చేస్తాడు. ఈ క్రమంలోనే.. వరంగల్ లో పని చేస్తున్న టైంలో మంత్రి కొడుక్కి తనదైన స్టైల్ లో బుద్ధి చెప్తాడు. దీంతో.. అల్లూరి జిల్లాలోని అడవివరం రైల్వే స్టేషన్ కు ట్రాన్స్ఫర్ అవుతాడు. కొండల మధ్యలో ఉండే ఓ గిరిజన ప్రాంతం అది. ఆ ప్రాంతం మొత్తం శివుడు (నవీన్ చంద్ర) పాలిస్తూ ఉంటాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులతో శీలావతి రకం గంజాయిని పండించి.. దాన్ని కోల్‌కతాకు స్మగ్లింగ్ చేయడమే అతని పని. లక్ష్మణ్ ఆ ఊర్లోకి అడుగుపెట్టిన వెంటనే శివుడికి ఎదురు తిరుగుతాడు. జిల్లా ఎస్పీ నుంచి మొత్తం రాజకీయ వ్యవస్థ సపోర్ట్ గా నిలిచిన శివుడికి.. ఓ రైల్వే ఎస్సై ఎలా బుద్ధి చెబుతాడు.. గంజాయి సామ్రాజ్యాన్ని ఎలా నేల తొక్కుతాడు.. అనేది స్టోరీ. ఇక ఈ కథలో తులసి (శ్రీ లీల) హనుమాన్ బెర్రీ 9రాజేంద్రప్రసాద్) పాత్ర ఏంటి అనేది స్క్రీన్ పై చూడాల్సిందే.

రివ్యూ:
దర్శకుడితో సినిమా అంటే రవితేజను సరికొత్తగా చూపిస్తారేమో.. ఏదైనా కొత్తదనం కనిపిస్తుందని ఆసక్తి అభిమానులలో మొదలవుతుంది. దీని దృష్టిలో పెట్టుకునే భాను భోగవరపు.. రవితేజను వింటేజ్ ఎనర్జీతో చూపించే ప్రయత్నాలు చేశాడు. రవితేజ నుంచి ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్, మాస్ యాక్షన్ అంశాలని మిక్స్ చేస్తూ.. ఒకప్పటి బెంచ్ మార్క్ హై మూమెంట్‌ను సినిమాలో చూపించే ప్రయత్నం చేసాడు. ఇవి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నా.. కథ మాత్రం రొటీన్ గా అనిపించింది. రవితేజ ఇప్పటికే ఎలాంటి మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను చాలా చేశాడని ఫీల్ ఆడియన్స్ కు కలుగుతుంది. అయితే.. హై ఎనర్జీ చూపిస్తూ మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లలో రవితేజను చూపించిన తీరు ఆకట్టుకుంది.
ఇక.. రవితేజ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లోకి వెళుతూ తాతతో ఉన్న అను బంధం, పెళ్లి కాకపోవడానికి కారణాలను ఫన్నీగా చూపిస్తూ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసిన డైరెక్టర్.. నవీన్ చంద్ర శివుడి విలనిజాన్ని, తన గంజాయి స్మగ్లింగ్ పరిచయం చేస్తూ.. కథల్లో వార్ చూపించే విధానం యావరేజ్‌గా నడిచింది. హీరో అడవి వరానికి ట్రాన్స్ఫర్ అవ్వడం.. అక్కడ శివుడు గ్యాంగ్ తనకు మధ్యన జరిగిన చిన్న గొడవలతో కథ కాస్త ఊపు అందుకుంది. శివుడు గంజాయి స్మగ్లింగ్ కోసం రైల్వేను ఉపయోగించుకోవాలని ఫిక్స్ అవుతాడు. దాన్ని అడ్డుకునేందుకు హీరో రంగంలోకి దిగి.. తన స్టైల్ లో దాన్ని ఎలా అడ్డుకున్నాడు.. అనేది స్టోరీ.
/rtv/media/media_files/2025/10/31/raviteja-2025-10-31-09-29-08.jpg)
ఈ క్రమంలో ఊరి ప్రజలతో హీరో చేసే యాక్షన్ సీక్వెన్స్ లు, ఆడియన్స్ కు థ్రిల్లింగ్.. హీరో దాచిపెట్టిన విలన్ సరుకును.. అతని గ్యాంగ్ ఎలా కనిపెట్టిందనే పాయింట్ చుట్టూనే.. సెకండ్ హాఫ్ అంత కొనసాగుతుంది. కానీ.. అందులో సీరియస్ నెస్ కనిపించకపోవడం.. హీరో నుంచి సరుకు రాబట్టేందుకు భోజనం పేరుతో హీరోయిన్ నడిపే డ్రామా.. సిల్లీగా అనిపించాయి. హీరోని చంపేందుకు శివుడి మామ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అడవిలో వాళ్ళ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్.. గూస్బంప్స్ తెప్పిస్తాయి. శివుడి ఇంటికి వచ్చి.. హీరో చేసే విధ్వంసం కూడా ఆడియన్స్‌కు థ్రిల్ ఇస్తుంది. ఫ్రీ క్లైమాక్స్.. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌గా హనుమాన్ బేరి పాత్రలో రాజేంద్రప్రసాద్ చేసే యాక్షన్ ఆకట్టుకుంటుంది.
నటీనటుల పర్ఫామెన్స్:
రవితేజ వన్ మ్యాన్ షోలో సినిమా అనిపించింది. వింటేజ్ స్టైల్, స్వాగ్, ఎనర్జీతో లక్ష్మణ్ భేరిగా స్క్రీన్ పై మ్యాజిక్ చేశాడు రవితేజ. ఫైట్, సాంగ్స్ చూపించిన హుషారు.. తనదైన కామెడీ టైమింగ్ అన్ని ప్రేక్షకులను మెప్పిస్తాయి. శ్రీ లీల మూడు కోణాల్లో సాగే పాత్రలో మెప్పించింది. ఇక రవితేజ, ఆమె మధ్యన వచ్చే సాంగ్స్ బాగున్నాయి. శివుడి పాత్రలో నవీన్ చంద్ర విలనిజం ప్రారంభంలో భయపెట్టినా.. క్లైమాక్స్ వచ్చేసరికి డలైపోయిందనిపిస్తుంది. హీరో తాత పాత్రలో రాజేంద్రప్రసాద్ ఆరంభంలో అక్కడక్కడ నవ్వించినా.. సెకండ్ హాఫ్ లో మాత్రం యాక్షన్ సీక్వెన్స్‌లతో అదరగొట్టాడు. హైపర్ ఆది, వీటిని గణేష్, అజయ్ గోష్ పాత్రలు ఆడియన్స్ లో నవ్వులు పూయించాయి.
![]()
టెక్నికల్ గా:
ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడంలో.. డైరెక్టర్ భాను భోగవరకు సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. యాక్షన్, కొరియోగ్రఫీ ప్రేక్షకులను మెపిస్తుంది. బీమ్స్ మ్యూజిక్, సాంగ్స్ యావరేజ్. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ప్లస్ లు మైనస్ లు:
రవితేజ నటన, ఎనర్జీ సినిమాకు హైలెట్. యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ చేసింది. సినిమాకు ఇవి ప్లస్ అయ్యాయని చెప్పాలి. అయితే.. స్టోరీ రొటీన్‌గా ఉండడం సినిమాకు అతిపెద్ద మైనస్.
ఫైనల్ గా: ఫ్యాన్స్ కు మాస్ జాతర.. ఫుల్ ఆఫ్ మాస్ ట్రీట్. సాధారణ ఆడియన్స్‌కు రొటీన్ స్టోరీ.

