టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా, మహేష్ బాబు. పి దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. ఇక రామ్ పోతినేని ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఇస్మార్ట్ శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఈ స్టోరీని ఎంచుకున్నాడు రామ్. ఎమోషనల్ ఫ్యాన్ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు నుంచే ఆడియన్స్‌లో డీసెంట్ బజ్ క్రియేట్ అయింది.
ఈ క్రమంలోనే నిన్న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయిన ఈ మూవీ.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఇలా.. ఎప్పటినుంచో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్‌కు.. చాలా కాలం గ్యాప్ తర్వాత ఒక మంచి హిట్ వైబ్ క్రియేట్ అయిందని చెప్పాలి. ఇక ఈ సినిమా యూఎస్ మార్కెట్లో భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకుందని టాక్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. అక్కడ ఈ సినిమా ఇప్పటికి 2 లక్షల 50 వేల డాలర్లకు పైగా వసూలు రాబట్టి దూసుకెళ్తోంది.

ఇక.. ఇదే జోరు వీకెండ్ వరకు కొనసాగితే ఈ కలెక్షన్స్ మరింత బలపడే అవకాశం ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో రావు రమేష్, మురళి శర్మ తదితరులు కీలకపాత్రలో నటించగా.. వివేక్ మర్విన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాడు. సినిమాలో మ్యూజిక్ కూడా ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇక రామ్ నటనకు ప్రశంసల వర్షం కురుస్తుంది. అలాగే ఉపేంద్ర కూడా స్టార్ హీరో రోల్‌లో సత్తా చాటుకున్నాడని.. హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ కనిపించాయంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ముందు ముందు ఈ సినిమాతో.. రామ్ ఏ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడతాడో చూడాలి.

