నందమూరి నటసింహం బాలకృష్ణ సక్సెస్ఫుల్ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయనకు గుడ్ టైం నడుస్తుంది. ఏ సినిమాలో నటించినా.. ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్గా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇలాంటి క్రమంలోనే.. బాలయ్యకు సంబంధించిన షాకింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. బాలయ్య 1 కాదు ఏకంగా రెండు భారీ ప్రాజెక్టులకు నో చెప్పేశాడంటూ టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ.. ఆ రెండు సినిమాలు ఏవో కాదు.. ఒకటి కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 సినిమా కాగా.. మరొకటి టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ రెండు సినిమాలను బాలకృష్ణ రిజెక్ట్ చేశాడట. రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2 లో బాలకృష్ణ ఓ స్ట్రాంగ్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అంటూ వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి.. జైలర్‌లోనే బాలయ్యతో ఓ రోల్ చేపించాలని నెల్సన్ చాలా ప్రయత్నించాడట. కానీ.. అది వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు మరో రోల్ కోసం బాలయ్యను అప్రోచ్ అయ్యారని అందుకు బాలకృష్ణ ఓకే కూడా చెప్పాడంటూ టాక్ వినిపించింది. కానీ.. లేటెస్ట్ సమాచారం ప్రకారం బాలకృష్ణ ఆ పాత్రలో నటించడం లేదట. దానికి కారణం.. జైలర్ 2లో బాలయ్య పాత్రతో చెప్పించే డైలాగ్స్. రజనీకాంత్‌ని హీరోగా ఎలివేట్ చేసేలా డిజైన్ చేశారట. బాలయ్యను హైలైట్ చేసేలా కాకుండా ఆయన మరో హీరోను ఎలివేట్ చేసేలా ఉండడంతో.. అలాంటి రోల్ లో నటించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు.. పైగా రజనీ కోసం చేయాలని చూసినా తన అభిమానుల్లో అసంతృప్తి వస్తుందని ఉద్దేశంతో బాలయ్య నో చెప్పేసాడట.

ఇక ఈ సినిమాతో పాటే బాలయ్య రిజెక్ట్ చేసిన మరో ప్రాజెక్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మిస్సెట్టి మిస్టర్ పోలీస్ బాబు.పి దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా ఓ హీరో డై హార్ట్ ఫ్యాన్ బయోపిక్‌లా రూపొందుతుందని సమాచారం. ఇందులో సూపర్ స్టార్ హీరోగా.. కన్నడ నటుడు ఉపేంద్ర మెరుసారు. మొదట.. ఈ రోల్ కోసం.. బాలకృష్ణను అప్రోచ్ అయ్యారట. దానికి బాలయ్య నో చెప్పేశాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. కారణం గతంలో మంచు మనోజ్ ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలయ్య అద్భుతమైన పాత్రలో నటించారు. కానీ.. ఆ సినిమాకు సరైన రెస్పాన్స్ రాలేదు. ఈ క్రమంలోనే ఆంధ్ర కింగ్ తాలూకాలోను నటించే ఆసక్తి చూపలేదట.

