” కృష్ణ లీల ” మూవీ రివ్యూ.. పూర్వ జన్మ ప్రేమ కోసం.. ఈ జన్మ పోరాటం..!

టాలీవుడ్ బ్యూటీ ధన్య బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ” కృష్ణ లీల.. తిరిగి వచ్చిన కాలం “. దేవాన్ హీరోగా స్వియ‌ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ మూవీలో.. బబ్లు పృద్వి, వినోద్ కుమార్, రజిత మ‌రియు తదితరులు కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాకు.. బేబీ వైష్ణవి సమర్పకరాలుగా వ్యవహరించగా.. మహాసేన విజువల్స్ బ్యానర్ పై జోత్స్‌నా ప్రొడ్యూసర్గా వ్య‌వ‌హ‌రించింది. ఈ సినిమా.. నేడు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. ఇక సినిమా ఎలా ఉందో.. ఒకసారి రివ్యూలో చూద్దాం.

ప్రేమించడం.. ప్రేమించబడటం.. రెండూ కర్మలే'.. ఆసక్తిగా టీజర్ | Devan and Dhanya  BalaKrishna latest Movie Krishna Leela Teaser out now | Sakshi

స్టోరీ:
విహారి (దేవాన్‌)అమెరికాలో టాప్ యోగా గురు. తన చెల్లి పెళ్లి కోసం ఇండియాకు వస్తాడు. బృందా (ధన్య బాల‌కృష్ణ) హోమ్ మినిస్టర్ కూతురు. బృందకు.. అబ్బాయిలంటే మొదటి నుంచి కోపం. ఈ క్రమంలోనే తండ్రి కాలేజీలో చదువుతూ.. అక్కడ అబ్బాయిలు అందరినీ ఏడిపించి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక.. చెల్లి పెళ్లి కోసం వచ్చిన విహారి.. బృందాన్ని చూస్తాడు. మొదటి చూపుతోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. గత జన్మ జ్ఞాపకాలన్నీ ఆయనకు గుర్తొస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే బృందా ఎంత తిట్టినా, కొట్టిన, మనుషులతో కొట్టించిన ఆమె వెంట పడుతూ ఉంటాడు. ఆమెతో మాట్లాడాల‌ని ప్రయత్నిస్తాడు. ఇక.. విహారి తల్లిదండ్రులు బబ్లు పృథ్వీ ,రజిత.. బృంద తండ్రి వినోద్ కుమార్‌ను కలిసి పెళ్లి గురించి మాట్లాడదాం అనుకుంటారు.

వాళ్లను అతను ఘోరంగా అవమానించి పంపించేస్తాడుజ‌ ఇక విహారీ డైరెక్ట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి.. నేను హోం మంత్రి కూతురిని చంపేసా అని చెప్తాడు. పోలీసులు ఎంక్వయిరీ చేస్తే.. బృందా బ్రతికే ఉంటుంది. ఏంటని అడిగితే.. నేను ఆమెను గత జన్మలో చంపేశానని చెప్పి విహారి షాక్ ఇస్తాడు. అసలు.. గత జన్మలో బృందా, విహారి మధ్యన బంధం ఏంటి.. వాళ్ళు ఎవరు.. విహారి లానే బృందకు కూడా పూర్వజన్మ గుర్తుకొస్తుందా.. బృందా – విహారి ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా.. ఇంతకీ పోలీసులు ఏం చేశారు.. బృందా తండ్రి పెళ్లికి ఒప్పుకున్నాడా.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెరపై చూడాల్సిందే.

Krishna Leela Movie | Devan, Dhanya Balakrishnan| Bhaskarabhatla |Bheems  Ceciroleo - YouTube

రివ్యూ:
ముందు జన్మలో ప్రేమలు.. ఈ జన్మలో కొనసాగడం లాంటి కథలతో ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు తెరకెక్కయి. ఈ కృష్ణ లీల కూడా అదే కోవకు చెందుతుంది. ఫస్ట్ అఫ్ మొత్తం హీరో, హీరోయిన్ల ఇంట్రడక్షన్.. విహారి, బృందా తో ప్రేమలో పడిపోవడం.. పోలీస్ స్టేషన్ కు వెళ్లే సీన్స్ కొనసాగుతాయి. చాలావరకు ల్యాగ్ అనే ఫీల్ ఆడియన్స్ కు కలుగుతుంది. ఇక కాలేజ్‌లో ధన్య బాయ్స్ ని ఏడిపించే సీన్స్ అయితే టూ మచ్ ఓవరాక్షన్ అనిపిస్తాయి. ఇక హీరో ఎంట్రీ.. హోల్డింగ్ చూస్తూ ఉంటాడు. ఎందుకని అడిగితే డైలాగ్ చెప్పి ఇంట్రడక్షన్ సాంగ్ వేసుకుంటాడు.. సరైన రీజన్ మాత్రం తెలియదు.

ఇక విహారి.. బృందా కోసం చేసే ప్రయత్నాలన్నీ రొటీన్ రొట్టె స్టోరీలా అనిపించాయి. మధ్యలో గత జన్మలో ప్రేమ అంటూ లీడ్ ఇచ్చే సీన్స్ కాస్త ఆడియన్స్‌లో ఉత్సాహం నింపాయి. పోలీస్ స్టేషన్కు వెళ్లి హోమ్ మినిస్టర్ కూతురిని చంపేశానని చెప్పడం.. గత జన్మలో అని చెప్పడం.. సినిమా పై ఆడియన్స్ లో కాస్త ఆసక్తి కల్పించాయి. ఇంటర్వెల్లో గత జన్మలో ఏం జరిగి ఉంటుందని సస్పెన్స్ ను ఆడియన్స్ కు ఇచ్చారు. ఇక ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీతగా అనిపించినా.. సెకండ్ హాఫ్ గత జన్మ గురించి మొదట్లో సగమే చూపించి.. క్లైమాక్స్ వరకు హైడ్‌ చేయడంతో.. ఏం జరిగి ఉంటుందని క్యూరియాసిటీ ఆడియన్స్ లో కనిపిస్తుంది.

Krishna Leela Review : కృష్ణ లీల రివ్యూ.. గత జన్మ ప్రేమ కోసం ఈ జన్మ  పోరాటం.. కొత్తగా చెప్పడంలో దేవన్ సక్సెస్ అయ్యాడా? | Krishna Leela Review A  Reincarnation Love Story Fails to ...

గత జన్మ లవ్ స్టోరీ కూడా రొటీన్ గానే ఉన్న.. క్యారెట్రైజేష‌న్‌ కొత్తగా ఉంది. ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత నేను బృందకు ప్రపోజ్ చేయాలి.. అందుకు ఆమె నన్ను కలిసేలా చేయాలంటూ కోర్టుకు విహారి వేసిన పిటీషన్ సీన్స్ కాస్త ఆడియన్స్ లో కొత్త ఫీల్ కనిపిస్తాయి. క్లైమాక్స్ వైవిద్యంగా ఉంది.. సినిమాలో శివుడు, శివతత్వం గురించి చెప్పించి.. టైటిల్ కృష్ణ లీల పెట్ట‌డానికి కారణం ఏంటో మేకర్స్‌కే తెలియాలి. ఇక.. సినిమాలో ఒక్కో పాత్ర ఒక్కో యాసలో మాట్లాడటం.. కాస్త వింతగా కన్ఫ్యూషన్ గా అనిపించింది. నటీనటుల భాష విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందనే ఫీల్ ఆడియన్స్‌లో కలుగుతుంది.

నటీనటుల పర్ఫామెన్స్:
దేవాన్ హీరోగా, దర్శకుడుగా తన రెండు రోల్స్ సక్సెస్ఫుల్‌గా ప్లే చేయడానికి ప్రయత్నించాడు. ధన్యా బాలకృష్ణ ప్రజెంట్ జన్మలో మోడరన్ గర్ల్‌గా, ఫ్లాష్ బ్యాక్‌లో గ్రామీణ యువతిగా నటించిన తీరు ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. పృథ్వీ – రజిత జంట తల్లిదండ్రులుగా కనిపించడం.. ఆడియన్స్ కు సరికొత్తగా అనిపిస్తుంది. ఇక.. సీనియర్ యాక్టర్ వినోద్ కుమార్.. హోమ్ మినిస్టర్ రోల్ లో నెగిటివ్ షేడ్స్‌లో బాగా చూపించారు. మిగిలిన నటినట్లు వాళ్ళ పాత్ర నడివిలో ఆకట్టుకున్నారు.

Krishna Leela Telugu movie Review rating public talk genuine review ta | Krishna  Leela Review: 'కృష్ణ లీల' మూవీ రివ్యూ.. News in Telugu

టెక్నికల్ గా:
సినిమాటోగ్రఫీ, విజువల్స్ యావరేజ్ గా అనిపించినా.. బీమ్స్‌ సిసిరోలియో అందించిన బిజిఎం, సాంగ్స్ ఏ మాత్రం అస్సలు ఆకట్టుకోలేకపోయాయి. ఇక.. ఎడిటర్ కత్తిరకు మరికొస్తా పని పెట్టి ఉంటే బాగుండేదని ఫీల్ ఆడియన్స్‌లో కలుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ సెట్స్ చూసినప్పుడు ఆర్ట్స్ డిపార్ట్మెంట్ కష్టం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. గ్రాఫిక్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సిందనే ఫీల్ కలుగుతుంది. రొటీన్ స్టోరీకే దైవత్వాన్ని జోడించి కొత్తగా చూపించేలా ప్రయత్నించాడు. మంచి నిర్మాణ విలువలు ఉన్న సినిమా.

ఫైనల్ గా: గత జన్మ ప్రేమ కోసం.. ఈ జన్మలో పోరాటం.