గ్లోబల్ ట్రోటర్ ఎఫెక్ట్.. రాజమౌళికి షాక్ పై షాక్.. ఏకంగా మూడు కేసులు నమోదు..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. కేవలం పాన్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఎన్నో సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన జక్కన్న.. ఎప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ.. ఎలాంటి వివాదాలు లేకుండా.. ఇండస్ట్రీలో కొనసాగ్తు వ‌చ్చాడు. అలాంటి జక్కన్న.. కెరీర్‌లో మొదటిసారి ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. మహేష్ బాబుతో తను తెర‌కెకిస్తున్న వారణాసి సినిమా గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్‌లో ఆయన హనుమంతుడుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. నేను దేవుని నమ్మను. కానీ.. హనుమంతుడు నావెనకుండి.. అంత నడిపిస్తున్నాడని మా నాన్న, భార్య అంటారు.

ఏది ఇదేనా చూసుకునేది.. అని వాళ్ళపై కోపం వస్తుందంటూ ఎమోషనల్ అయ్యాడు రాజమౌళి. తనని తాను నాస్తికుడుగా చెప్పుకునే రాజమౌళి.. ఇలా హనుమంతుడిపై కామెంట్స్ చేయడంతో.. హిందూ సంఘాలు ఆయనపై ఫైర్ అయ్యాయి. తను చేసిన కామెంట్లను తీవ్ర అభ్యంతరాలుగా వ్యక్తం చేశాయి. డబ్బుల కోసం శ్రీరాముని రాజమౌళి వాడుతున్నాడని.. హనుమంతుని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని.. రాష్ట్రీయ వానర సేన సంఘం సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బహిరంగంగా హనుమంతుడికి క్షమాపణలు చెప్పి.. తప్పైందని వేడుకోవాలని డిమాండ్ చేశారు. ఇక.. ఈ సినిమా గ్లింప్స్‌లో మహేష్ బాబు నంది పై కూర్చుని కనిపిస్తాడు. అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఈవెంట్‌లోను మహేష్ ఇలాగే ఎంట్రీ ఇచ్చాడు.

SS Rajamouli emotionally admits to feeling let down by Lord Hanuman at  Varanasi event: 'I don't believe in God but…' | Hindustan Times

హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే నందిపై హీరోని కూర్చోబెట్టి రాజమౌళి డబ్బులు సంపాదించుకోవాలని చూస్తున్నాడని.. ఓ నాస్తికుడగా ఆయన పనులు హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే అంటూ మరో కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. ఇక దీంతోపాటే ఈవెంట్ ఎఫెక్ట్ తో.. రాజమౌళి మెడకు మరో వివాదం చుట్టుకుందట. అదే.. బాహుబలి ది ఎట‌ర్న‌ల్ ట్రైల‌ర్‌. ఇందులో బాహుబలి.. ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్లు చూపించడం.. ఇది హిందూ దేవుడ్ని అవమానించినట్లుగా ఉందని కేసు నమోదు అయినట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే.. ఒకే ఒక్క ఈవెంట్, ఒక్క సింగిల్ కామెంట్.. దాదాపు రెండేళ్ల తర్వాత రిలీజ్ కాబోయే సినిమా కోసం చేసిన ఏర్పాట్ల‌తో రాజమౌళి వివాదాల్లోకి వెళ్లిపోయాడు. ఇప్పటిదాకా ఆయన కానీ.. ఆయన టీం కానీ ఈ వివాదాలు పై రియాక్ట్ కాలేదు. ఇక ఈ కేస్ కారణంగా జక్కన్న ప్రస్తుతం నష్టపోకపోయినా.. దీనిపై రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇవ్వకపోతే ఫ్యూచర్లో ఈ ప్రాజెక్టు పై ఆ ఎఫెక్ట్ పడుతుందని అభిప్రాయాలను నెటింట వినిపిస్తున్నాయి.