గ్లోబల్ ట్రోటర్ రైట్స్ రాజమౌళి ఎన్నికోట్లకు అమ్మేశాడో తెలుసా.. ఇదెక్కడి అరాచకం రా సామి..

టాలీవుడ్ దర్శకధీరుడుగా ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ పై చెరగని ముద్ర వేశాడు రాజమౌళి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పేందుకు అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్నాడు, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా పృథ్వీరాజ్ సెకుమార‌న్ విల‌న్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై పాన్‌ వరల్డ్ లెవెల్‌లో ఆడియన్స్‌లో హైప్‌ క్రియేట్ చేశాడు జక్కన్న. ఈ సినిమా నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ లుక్ రివీల్‌ చేస్తూ.. హైప్‌ మరింతగా పెంచుతున్నాడు. వారం కిందట పృథ్వీరాజ్ సుకుమారన్‌ రివీల్ చేసిన ఆయన.. కొద్దిసేపటి క్రితం ప్రియాంకా లుక్స్ రివీల్ చేశాడు. వీళ్ళిద్దరి లుక్స్ పై పలు విమర్శలు ఎదురైనా.. సినిమాపై మాత్రం ఆడియన్స్ లో మంచి హైప్‌ క్రియేట్ అయింది.

Rajamouli's SSMB29 Hyderabad Reveal with Mahesh, Priyanka - India Weekly

ఇక మరో రెండు రోజుల్లో నవంబర్ 15న రామోజీ ఫిలింసిటీలో గ్లోబల్ ట్రోట‌ర్ పేరుతో ఓ ఈవెంట్‌ను కండెక్ట్ చేయనున్నాడు. ఇందులో.. మహేష్ లుక్, గ్లింప్స్‌తో పాటు.. టైటిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నాడట జక్కన్న. ఇక ఈ ఈవెంట్‌కు మీడియా సంస్థలకు ఆహ్వానం లేదని కరాకండిగా చెప్పేసాడు జ‌క్క‌న‌. కారణం ఈ ఈవెంట్ హ‌క్కుల‌ను కూడా.. జియో హాట్స్టార్‌కు అమ్మేయ‌డం. దాదాపు రూ.50 కోట్లకు ఈ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇక రాజమౌళి సినిమా విషయంలోనే కాదు.. ప్రమోషన్స్‌లో కూడా బిజినెస్ చేస్తూ లాభాలను తెచ్చిపెడుతున్నాడు.

అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు సైతం ఆసక్తి చూపుతూ ఉంటారు. జక్క‌న‌ సినిమా అంటే అంత లాభమే కానీ నష్టం వచ్చే అవకాశం ఉండదు. తన సినిమాలు అంతలా డెడికేటెడ్ గా రూపొందిస్తాడు రాజమౌళి. ఇక ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తూ హైప్ క్రియేట్‌ చేస్తాడు. మొత్తానికి ఈవెంట్ రైట్స్ అలా జియో హాట్స్టార్‌కు అమ్మేయడం ఆడియన్స్‌లో మరింత ఆశ‌క్తి క్రియేట్ చేస్తుంది. ఇలా.. ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్‌తో కూడా బిజినెస్ చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇండియాలో ఇప్పటివరకు ఇలాంటి ఈవెంట్‌ ఎక్కడ నిర్వహించలేదు. ఓటీటీ సంస్థకు కూడా అమ్మలేదు. ఈ క్రమంలోనే.. జక్కన్న బిజినెస్ మైండ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.