టాలీవుడ్ నందమూరి నరసింహం బాలకృష్ణ, బోయపాటి శీను కాంబో మూవీ అంటేనే ఆడియన్స్‌లో మంచి మాస్ ఫీల్ కలుగుతుంది. ఇక.. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబోలో మూడు సినిమాలు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక.. ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబో అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా అఖండ 2 తాండవం రూపొందుతుంది. ఈ క్రమంలోనే.. సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ ఓటీటీలో నార్త్ ఆడియన్స్నుంచి సాలిడ్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే మేకర్స్ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేసి.. మంచి రిజల్ట్ అందుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇప్పటికే నార్త మార్కెట్లో ఆఖండ 2 ప్రమోషన్స్ మొదలైపోయాయి. అక్కడ బాలయ్య అఖండ 2 ఓటీటీ గ్రాస్‌తో మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంటుందని నమ్మిన మేకర్స్‌కు ఊహించని షాక్ ఎదురైందని చెప్పాలి. మ్యాటర్ ఏటంటే.. బాలీవుడ్ ఎనర్జీటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా కూడా.. బాలయ్య అఖండ 2 రిలీజ్ రోజునే (డిసెంబర్ 5న) రిలీజ్ కు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే అఖండ 2కు బాలీవుడ్లో పెద్ద పోటీ ఎదురైందని చెప్పాలి. ధురంధర్ ట్రైలర్ ఇప్పటికే రిలీజై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. యాక్షన్, విజువల్స్, రణ్వీర్ స్క్రీన్ ప్రజెన్స్ అన్ని.. సినిమాకు బిగ్గెస్ట్ హైప్‌ను అందిస్తున్నాయి.
ఈ క్రమంలోనే.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అఖండ 2 సక్సెస్ అవ్వాలంటే.. కఠినమైన పోటీ ఎదుర్కోక తప్పని పరిస్థితి. అఖండకు నార్త్ లో ఇప్పటికే మంచి క్రేజ్ ఉన్న కూడా.. హిందీ మార్కెట్లో మాత్రం పోటీ మరింత కీలకంగా మారింది. అక్కడ ఫస్ట్ డే స్క్రీన్ షేర్, షోస్, అలాగే ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ప్రమోషన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే.. కలెక్షన్లు అంతే బలంగా వస్తాయి. ఈ క్రమంలోనే ధురంధర్ సినిమా పోటీతో పాటే.. ఆ ఆ సినిమాకు వచ్చేటాక్ కూడా అఖండ 2 పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే.. బాలయ్య మార్క్ యాక్షన్, బోయపాటి మాస్, థమన్ సెన్సేషన్ మ్యూజిక్ కలిసి అఖండ 2 రూపొందుతున్న క్రమంలో.. నార్త్‌లోను ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే.. ధురంధర్ వర్సెస్ అఖండ 2 వార్ స్ట్రాంగ్‌గా జరగనుంది. ఇక.. నార్త్‌లో ఆఖండ 2 ఆడియన్స్‌ను ఆకట్టుకుని.. ధురంధర్ సినిమా రికార్డులను బ్రేక్ చేయగలిగితే.. బాలయ్య రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళుతుంది. అది నిజంగానే అఖండ తాండవం లాగే ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.


