” స్పిరిట్ ” తర్వాత ఆ స్టార్ హీరో తో సందీప్.. టాలీవుడ్ సెన్సేషనల్ కాంబో ఫిక్స్

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా తాను తెర‌కెక్కించిన‌ ప్రతి సినిమాతోను పాన్ ఇండియా లెవెల్‌ సక్సెస్‌లు అందుకని ఎప్పటికప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే.. తాను చేసిన స్టోరీలపై ఆడియన్స్‌లోను మంచి ఆసక్తి మొదలైంది. అయితే.. ప్రస్తుతం సందీప్ ప్ర‌భాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. దీంతో.. ప్రభాస్ అభిమానులు కాదు.. మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక.. ప్రభాస్ సినిమాలో మునుపెన్నడూ లేని మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే సందీప్.. డార్లింగ్‌నుని స్పిరిట్‌లో ఎంత పవర్ఫుల్గా చూపించబోతున్నాడు అని ఆసక్తి అందరిలోనూ మొదలైంది,

Chiranjeevi kicks off Prabhas and Sandeep Reddy Vanga's Spirit

ఇక తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూట్ మొదలుపెట్టి వీలైనంత త్వరగా సినిమాను కంప్లీట్ చేయాలని సందీప్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఏకంగా రూ.2500 కోట్ల కొల్లగొట్టడం ఖాయమని.. ఇండియన్ హైయెస్ట్ గ్రాస్ సినిమాగా స్పిరిట్ నిలవబోతుందంటూ సందీప్ థీమా వ్య‌క్తం చేసాడు. ఈ క్రమంలోనే సందీప్ స్పిరిట్ తర్వాత ప్రాజెక్ట్ ఏమై ఉంటుందని ఆసక్తి కూడా అందరిలోనూ మొదలైంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం సందీప్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరోతో చేసేందుకు సిద్ధమవుతున్నాడట. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి,

Is Chiranjeevi part of Prabhas' Spirit? Sandeep Reddy Vanga clarifies on  rumours - India Today

టాలీవుడ్ సీనియర్ హీరోల నుంచి వారి ఏజ్చ‌ రేంజ్ కు తగ్గ పర్ఫెక్ట్ సినిమా వస్తే బాగుండని ఎప్పటినుంచో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే తరహా సరికొత్త ట్రీట్ తో.. సందీప్ చిరంజీవి ని స్క్రీన్ పై చూపించాలని ఫిక్స్ అయ్యాడట. మొదటి నుంచి సందీప్‌కు చిరంజీవి అంటే ఎంతో అభిమానం అని ఎన్నోసార్లు అఫీషియల్ గా వెల్ల‌డించాడు. ఈ క్రమంలోని రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్‌ కూడా.. ఈ మెగా ఫ్యాన్ బాయ్‌ సందీప్.. చిరుతో సినిమా చేస్తే బాగుంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా.. స్పిరిట్ పూజా కార్యక్రమాల్లో చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా హాజరై ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపాడు. ఇక సందీప్.. స్పిరిట్ తర్వాత ఓ ఇంటెన్స్.. పవర్‌ఫుల్ సినిమాతో మెగాస్టార్‌ను స్క్రీన్ పై చూపించాలని ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సందీప్, చిరు సెన్సేషనల్ కాంబో వార్తలు ఎంత వాస్తవమో తెలియదు కానీ.. ఇదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు ఇది బిగ్ ఫెస్టివల్ డే అవుతుంది అనడంలో సందేహం లేదు.