ఇటీవల కాలంలో ఇండస్ట్రీ తీరు పూర్తిగా మారిపోయింది. సినిమాల బడ్జెట్ రోజు రోజుకు కోట్లల్లో పెరిగిపోతున్నాయి. వందల కోట్లు బడ్జెట్.. వెయ్యి కోట్ల వరకు కూడా చేరుతున్నాయి. అయితే కేవలం సినిమాలే అనుకుంటే.. ఇటీవల కమర్షియల్ యాడ్స్ సైతం బడ్జెట్లో లెక్కచేయకుండా కోట్లు ఖర్చు చేసి తీసేస్తున్నారు. గతంలో కమర్షియల్ యాడ్ చేయడానికి యాడ్ ఫిలిం మేకర్స్ అంటూ స్పెషల్ గా ఉండేవాళ్ళు. కానీ.. ఇప్పుడు స్టార్ట్ డైరెక్టర్లు కూడా యాడ్ చేయడానికి సిద్ధమైపోతున్నారు. అలా.. ఇప్పటికే తెలుగులో రాజమౌళి, బోయపాటి, త్రివిక్రమ్ ఇలా.. ఎంతో మంది దర్శకులు యాడ్ షూట్లను కంప్లీట్ చేసిన వాళ్లే. దీనికి తగ్గ రేంజ్ లో రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి క్రమంలో.. తాజాగా తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన యాడ్ హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం అల్లు అర్జున్‌తో అట్లీ పాన్ వరల్డ్ సినిమాలో తీస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో.. అట్లి ఒక కమర్షియల్ యాడ్ కోసం ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేశాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. తాజాగా ఈ యాడ్ రిలీజ్ అయింది. అది కూడా ఎనిమిది నిమిషాల యాడ్. ఇక.. ఈ యాడ్‌ను రిలీజ్ చేయడానికి కూడా ప్రీమియర్ షో అంటూ స్పెషల్ గా హంగామా చేశారు. ప్రస్తుతం హంగాబా అంతా నెట్టింట వైరల్‌గా మారడంతో.. సాధారణ ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఒక ప్రోడక్ట్ కోసం ఎనిమిది నిమిషాల యాడ్ ఎందుకు.. రూ.50 కోట్ల బడ్జెటా అంటూ షాక్ అవుతున్నారు. ఇక.. యాడ్ స్టార్టింగ్ లో ఆర్మీ వాళ్ళని బంధించడం, ఏజెంట్ వచ్చి ఫైట్ చేసి వాళ్ళని కాపాడడం చూపించారు. షూట్లో భారీ యాక్షన్ సీన్స్ తో పాటు.. చివర్లో సాంగ్ ని కూడా చూపించారు. ఇదంతా చూసి పెద్ద గొప్ప యాడ్డేమో అనుకునేరు అది కేవలం ఒక షెజ్వన్ సాస్ యాడ్.
ఈ ఒక్క యాడ్ కోసం రూ.150 కోట్లు ఖర్చుపెట్టి మరి ఇంత మాస్ యాక్షన్ ను దించారా బ్రో అంటూ.. అట్లీపై విమర్శలు కురిపిస్తున్నారు. రోజురోజుకీ క్రియేటివిటీ మరి ఎక్కువైపోతుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటులు రణబీర్ సింగ్, బాబీ డియోల్, టాలీవుడ్ బ్యూటీ శ్రీ లీలా లాంటి స్టార్స్ తో పాటు.. ఓ 100 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో భారీ లెవెల్లో ఈ యాడ్ ని చేశారు. ఇక లొకేషన్స్ కూడా రియాలిటీగా ఉండేలా భారీగా ప్లాన్ చేసుకొని.. గ్రాఫిక్ వర్క్ కూడా అసైన్ చేశారు. ఈ క్రమంలోనే స్టార్స్ రెమ్యూనరేషన్, బడ్జెట్ అంతా కలుపుకొని రూ.150 కోట్ల వరకు అయ్యిందట. ఇక మళ్లీ ఈ యాడ్ ప్రమోషన్ ఈవెంట్ పెట్టడం కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి ఎంత వెర్రి కాకపోతే.. ఒక సాస్ యాడ్ కోసం ఈ రేంజ్ లో బడ్జెట్ కేటాయించడం అవసరమా.. ఇదెక్కడి పైత్యం రా బాబు.. ఒక సాస్ జనాల్లో ప్రమోట్ చేయడానికి ఇంతలా ఖర్చు పెట్టాలా.. అంటూ మండిపడుతున్నారు నేటిజన్స్. ఈ కాస్ట్లీ, లాంగ్ లెన్త్ యాడ్ ని మీరు కూడా ఓ లుక్కేసేయండి.