అనుష్కతో ఉన్న ఈ చిన్నారి టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. గుర్తుపడితే మీరు జీనియస్..!

సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ గా అనుష్క తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దంలో కాలం పాటు.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. లేడి ఓరియంటెడ్ సినిమాలతో తనదైన లెవెల్‌లో సత్తా చాటుకుంది. ఓ స్టార్ హీరో రేంజ్‌లో అనుష్కకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం టాలీవుడ్ అనే కాదు.. తమిళ్, కన్నడ భాషలోను దాదాపు అందరూ స్టార్ హీరోలు సినిమాలోని నటించి మెప్పించిన ఈ అమ్మ‌డు.. టాలీవుడ్ లేడీ ఒరేయించే సినిమాలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయింది. అలా ఒకప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. బాహుబలి సినిమాతో నేషనల్ లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.

Salaar child artist Farzana talks about Prabhas' prediction - Telugu News -  IndiaGlitz.com

అయితే.. తర్వాత సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించేసింది. కాగా తాజాగా అనుష్కకు సంబంధించిన ఒక క్రేజీ ఫోటో నెట్టింట వైరల్ గా మారుతుంది. అయితే.. ఈ ఫోటోలో అనుష్కతో కలిసి కనిపించిన చిన్నారి గురించే ప్రజెంట్ టాక్.. ఆమె ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ బ్యూటీ. ఇంతకీ ఎవరో గుర్తుపడితే మీరు నిజంగా జీనియస్. తనని చూస్తే ఎక్కడో చూసినా ఫీల్ కలుగుతుంది కదా.. కానీ ఆమె ఎవరో గుర్తు రావడం లేదా.. సర్లెండి మేమే చెప్పేస్తాం. ఆమె ప్రభాస్.. సలార్ సినిమాలో బ్లాక్ బస్టర్ ఫైట్ ఎపిసోడ్ కాటేరమ్మ సీక్వెన్స్ లో కనిపించిన కుర్ర బ్యూటీ.

Farzana Sayyed: Age, Photos, Biography, Height, Birthday, Movies, Latest  News, Upcoming Movies - Filmiforest

తన కోసమే ప్రభాస్.. సినిమాలో విలన్స్ అందరిని చంపేస్తాడు. ఆ సీన్స్.. అందులో నటించిన ఈ చిన్నారిని ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. అసలు పేరు సయ్యద్ ఫర్జాన. ఈ సినిమాకు ముందు కూడా పర్జానా చాలా సినిమాల్లో మెరిసింది. విశ్వ‌క్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమాలోని ఈమె ఆడియన్స్‌ను పలకరించింది. అంతకుముందు ఝాన్సీ అనే వెబ్ సిరీస్ లో మెరిసింది. అంతేకాదు.. ఐపీఎల్ యాడ్స్, ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ప్రోమోలో సైతం మెరిసింది. కొన్ని స్కూల్ యాడ్స్ లో కూడా. కాని ఎన్ని సినిమాలు, యాడ్స్ లో కనిపించినా.. ఏ మూవీ ఇవ్వని ఇమేజ్.. సలార్ సినిమా తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడైతే.. తన గ్లామర్‌తో హీరోయిన్ రేంజ్‌లో ఆకట్టుకుంటుంది. త్వరలోనే లీడ్ రోల్ లో ఓ వెబ్ సిరీస్లో మెరవనుంది.