టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఫ్యామిలీ కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చివరిగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో ఆడియన్స్‌ను పలకరించిన అనిల్ రావిపూడి.. వెంకీ ఖాతాలో భారీ బ్లాస్టర్ చేరేలా చేశాడు. ఇప్పుడు.. మరోసారి సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. సినిమాలో నయనతార హీరోయిన్గా మేరవనుంది.
ఇక సినిమా సెట్స్ పైకి రాకముందే వింటేజ్ చెరువుని చూస్తారని.. ఆయనలోని కామెడీ యాంగిల్ ఆడియన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుంది అంటూ కామెంట్స్ చేసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాడు అనిల్. ఇక ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే ప్రమోషన్స్‌తోనే భారీ లెవెల్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకుని ఓపెనింగ్స్ తోనే భారీ కలెక్షన్లు కొల్లగొడతాడు. ఈ క్రమంలోనే చిరు సినిమా ప్రమోషన్స్ సైతం మెల్లమెల్లగా మొదలుపెట్టేసాడు. తాజాగా.. ఈ సినిమా నుంచి మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. ప్రస్తుతం ఈ సాంగ్ వరస రికార్డులు కొల్లగొడుతూ క్రేజీగా దూసుకుపోతుంది.
యూట్యూబ్‌లో ఇప్పటికే టాప్ ట్రైడింగ్‌లో నిలిచిన సాంగ్.. 30 వేల రీల్స్, 300 మిలియన్ రేల్స్ వ్యూస్‌తో క్రేజీ రికార్డులు ఖాతాలో వేసుకుంది. అంతేకాదు.. అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లోను ఏకంగా 50 మిలియన్లకు పైగా ఈ సినిమాను ప్లే చేయడం విశేషం. ఇక ఈ సినిమాకు బీమ్స్ సిసి రోలియో మ్యూజిక్ అందించగా.. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. భాస్కర భట్ల, రవికుమార్ లిరిక్స్ సమకూర్చారు. ఈ క్రమంలోనే కేవలం ఒక్క రొమాంటిక్ సాంగ్‌తోనే ఆడియన్స్‌లో ఈ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకున్న అనిల్.. ముందు ముందు సినిమాను ఎంతలా ప్రమోట్ చేస్తాడో.. సినిమాతో చిరంజీవికి ఎలాంటి రిజల్ట్‌ని అందిస్తాడో చూడాలి.