నీ బయోపిక్ నేనే తీస్తా.. రవితేజ, సిద్దు జొన్నలగడ్డ క్రేజీ కాన్వర్జేషన్.. టాప్ సీక్రెట్ రివిల్..!

ఇటీవల కాలంలో ఓ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. మూవీ టీం అంతా.. వైవిధ్యమైన ప్రమోషన్స్ తో ఆడియన్స్‌ను తమ వైపు తిప్పుకోవాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. ఏదో ఒక వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తూ.. సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు పబ్లిక్ స్టంట్స్‌ చేస్తుంటే.. కొంతమంది వెబ్సైట్, డెలివరీ బాక్స్ల ద్వారా రకరకాలుగా తమ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. తాజాగా ఇద్దరు స్టార్ హీరోలు.. తమ సినిమాల కోసం కలిసికట్టుగా చేసిన ప్రమోషన్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సాధారణంగా.. సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమాలోని హీరో, హీరోయిన్ మూవీకి మాత్రమే ప్రమోషన్స్ చేస్తారు. కానీ.. ఇప్పుడలా కాకుండా.. దీపావళి సందర్భంగా రిలీజ్ కానున్న రెండు సినిమాలకు సంబంధించిన ఇద్దరు హీరోలు ఉమ్మడిగా.. తమ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టి అందరికి షాక్‌ను కలిగించారు.

Telusu Kada Announcement | Siddhu Jonnalagadda | Raashii | Srinidhi |  Neeraja Kona | Thaman S

ఇంతకీ ఆ హీరోలు ఎవరు.. ఆ సినిమాలేంటి.. ప్రమోషన్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. ఇంతకీ ఆ హీరోలు మరెవరో కాదు సిద్దు జొన్నలగడ్డ, రవితేజ. త్వరలోనే వెళ్లిద్దరి రెండు సినిమాలు ఆడియన్స్‌ను పలకరించనున్నాయి. మొదట సిద్దు జొన్నలగడ్డ, రాసి కన్నా, శ్రీనిధి శెట్టి కలిసి నటించిన.. తెలుసు కదా సినిమా దీపావళికి అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. ఈ సినిమా వచ్చిన కొద్దిరోజుల గ్యాప్‌తో అక్టోబర్ 31న రవితేజ, శ్రీ లీలా కాంబోలో మాస్ జాతర సినిమా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే రెండు సినిమాల ప్రమోషన్స్‌ను వేరువేరుగా చేయకుండా.. ఇద్దరు హీరోలు కలిసి ఒకేసారి సినిమాలకు ప్రమోషన్స్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. వీళ్లిద్దరి మధ్య జరిగిన క్రేజీ కాన్వర్జేషన్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది.

ప్రమోషన్స్‌లో కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా.. తమ పర్సనల్స్ సైతం ఈ హీరోలు పంచుకోవడం విశేషం. ఇక ఇందులో భాగంగానే.. సిద్దు జొన్నలగడ్డ తన పర్సనల్ అభిప్రాయాన్ని రవితేజ తో షేర్ చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ మేటర్ విన్న రవితేజ ఫ్యాన్స్ అయితే తెగ మురిసిపోతున్నారు. అసలు మేటర్ ఏంటంటే.. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ ఇంటర్వ్యూలు భాగంగా మాట్లాడుతూ కృష్ణ అండ్ హిస్ లీల రిలీజ్ అయిన తర్వాత నీ బయోపిక్ తీయాలని చాలా అనుకున్నా.. దాదాపు రెండు నెలలు దానికోసం పనిచేశా అంటూ సిద్దు వివరించాడు.

Mass Jathara (2025) - IMDb

రవితేజ అది విన్న వెంటనే ఆశ్చర్యపోయి ఏంటి నిజమా అని ప్రశ్నించగా.. నిజంగానే చెప్తున్నా అంటూ సిద్దు జనులగడ్డ కామెంట్ చేశారు. భవిష్యత్తులో కచ్చితంగా నీ బయోపిక్ నేనే తీస్తా అంటూ సిద్దు చేసిన కామెంట్స్ రవితేజకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. రవితేజ రియాక్ట్ అవుతూ.. నేను కూడా ఒక బయోపిక్ తీయాలని ఆలోచనలో ఉన్న.. కానీ ప్రస్తుతానికి ఆ డీటెయిల్స్ అన్ని సీక్రెట్ గానే ఉంచుతా అంటూ వివరించాడు. అంతేకాదు.. బయోపిక్ పై తమ వర్షన్‌లో అభిప్రాయాలను ఇద్దరూ షేర్ చేసుకున్నారు. ఏదేమైనా ఈ కాన్వర్జేషన్తో ఆడియన్స్ కు త్వరలోనే సిద్ధిజొన్నలగడ్డ, రవితేజ బయోపిక్‌లు చేయనున్నార‌ని క్లారిటీ వచ్చింది. అయితే.. రవితేజ చేయనున్న ఆ బయోపిక్ ఎవరిదని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ప్రస్తుతం వీళ్ళిద్దరికీ కాన్వర్జేషన్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది.