జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని అసలు అనుకోలేదు.. రేణు దేశాయ్

సీనియర్ హీరోయిన్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి ఆడియన్స్ లో పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన అభిమానులతో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకునే రేణు దేశాయ్.. ఇటీవల దీపావళి విషెస్ ను తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని ఓ పోస్ట్ పంచుకుంది. రాత్రి 9 గంటల తర్వాత ఎక్కువ శబ్దం వచ్చే క్రాకార్స్‌ను పేల్చావొద్దని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేసింది. ఇక.. దీపావళి పూర్తి అయిన తర్వాత.. తాజాగా మరోసారి తన ఇన్స్టా వేదికగా రేణు దేశాయ్ పోస్ట్ చేసిన వీడియో నెటింట‌ వైరల్‌గా మారుతుంది.

Aadya decided not to have a fancy birthday party and told me instead to use that money for the NGO rescue work! So proud of my li'll baby🤩🧡

తాజాగా.. దీపావళి ఇంటర్వ్యూలో తను సన్యాసం తీసుకోవడం పై చేసినా కామెంట్స్ గురించి రియాక్ట్ అయింది. నా జీవితంలో ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ ఆమె ఈ వీడియోని ప్రారంభించింది. నా లైఫ్ లో నా పిల్లలే అన్నింటికంటే ముఖ్యం. వారి లైఫ్ సెటిల్ చేశాకే నేను ఏ డెసిషన్ అయినా తీసుకుంటా.. ఇంటర్వ్యూలో చాలా ఫన్నీగా సన్యాసం తీసుకుంటానని నేను రియాక్ట్ అయ్యా.. అంతేకానీ ఇప్పటికిప్పుడు నేను సన్యాసం తీసుకుని దూరమవుతానని ఎక్కడ చెప్పలేదు. దానిని పెద్ద సెన్సేషన్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి నా ఫ్రెండ్స్, బంధువులు కాల్ చేసి మరి ఈ విషయం గురించి తెగ అడుగుతున్నారు.

Renu Desai Sparks Fresh Controversy Again | Renu Desai Sparks Fresh Controversy Again

అసలు రేణు నీకేమైంది.. బాగానే ఉన్నావా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆధ్య ఇంకా 10త్ చదువుతుంది. వాళ్ళిద్దరి బాధ్యత నాపై ఉంది. ఇప్పుడైతే నేనేమీ సన్యాసం తీసుకోను. నా వయ‌స్సు 55 – 60 వచ్చినప్పుడు ఆలోచన చేస్తా. నాకు ఇప్పుడు దేవుడి కంటే.. నా పిల్లలు ముఖ్య అంటూ రేణు వివరించింది. దయచేసి నాపై పెట్టే కాన్సన్ట్రేషన్ దేశంలో ఉన్న ఎన్నో సమస్యలపై మీడియా పెడితే బాగుంటుందంటూ తన అభిప్రాయాన్ని వీడియో ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)