మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో శర వేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా.. 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. సినిమాను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై సాహుగారపాటి, సుస్మిత కొణిదల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ఇప్పటివరకు సినిమాలో విలన్ పాత్ర ఎవరు పోషిస్తారు అనే దానిపై ఏ హింట్ కూడా బయటకురాని సంగతి తెలిసిందే.
ఇలాంటి క్రమంలో.. తాజాగా విలన్ పాత్రలో ఒక క్రేజీ నటుడిని.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు.. దసరా మూవీలో విలన్ షైన్ టామ్ చాకో. ఈ సినిమాలో పాత్రకు సరిపడే ఇమేజ్, బాడీ లాంగ్వేజ్, నటన ఉన్న వ్యక్తి షైన్ మాత్రమేనని ఆయనను అనిల్ ఎంచుకున్నట్లు సమాచారం. ఇప్పటికే.. షైన్ టామ్‌తో మూవీ టీం చర్చలు కూడా జరపారని.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే.. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రానుందట. షైన్ టామ్ ప్రస్తుతం తెలుగు,తమిళ్, మలయాళం మూడు భాషల్లోని వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడునుతున్నాడు.
ఆయన తాజాగా నటించిన టాలీవుడ్ సినిమాలలో రంగబలి, దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ ఉన్నాయి. ముఖ్యంగా దసరా మూవీ తర్వాత షైన్ టామ్ చాక్కు సౌత్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ నెలకొంది. ఇప్పుడు చిరంజీవి సినిమాలో సైతం ఆయన ఛాన్స్ కొట్టేసాడు. ఇక.. ఈ సినిమాలో మరోసారి తన నటనతో సత్తా చాటుకుంటే చాలు.. పాన్ ఇండియన్ ఇమేజ్ కాదు.. ఆయన మార్కెట్ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇక ఇప్పటివరకు అనీల్ రావిపూడి తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ సక్సెస్‌లు అందుకున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి మన శంకర వరప్రసాద్ గారుతో హిట్ కొట్టి.. రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.