టాలీవుడ్ ఇండస్ట్రీలో తమదైన నటనతో రాణిస్తూ.. పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నా స్టార్ హీరోలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో మహేష్ బాబు సైతం ఒకడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన.. రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో సినిమాలో నటిస్తున్నాడు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను రాజమౌళి కేవలం పాన్ ఇండియా లెవెల్ కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మార్కెటింగ్ స్ట్రాటజీని ప్రారంభించాడు కూడా.
ఇక ఈ సినిమాని ఏకంగా 120 దేశాల్లో గ్లోబల్ ట్రోటర్గా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాకుండా పగడ్బందీగా ప్లాన్ చేశాడు. మహేష్ బాబు బర్త్డే రోజున కూడా కనీసం మహేష్ ఫేస్ రివిల్ చేయకుండా.. ప్రీ పోస్టర్ తో సరి పెట్టేసాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి పై మండిపడ్డారు. అసలు ఇలా ఎందుకు సీక్రెట్ మైంటైన్ చేస్తున్నాడు.. సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా ఇచ్చి ఉంటే బాగుండేదంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమాలోని కాస్టింగ్ వివరాలను జక్కన్న రిలీజ్ చేశాడంటూ టాక్ వైరల్‌గా మారుతుంది.
ఇందులో వాస్తవం ఎంత తెలియదు కానీ.. ఈ లిస్టులో బడా స్టార్ కాస్టింగ్ ఉండడం విశేషం. తమిళ్ సినీ ఇండస్ట్రీ నుంచి విజయ్ సేతుపతి, మలయాళ ఇండస్ట్రీ నుంచి పృధ్వీరాజ్ సుకుమారాన్, కన్నడ ఇండస్ట్రీ నుంచి కిచ్చ సుదీప్, బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహం నటించనున్నాగట. ఇలా మొత్తంగా ఇండియాలో అన్ని భాషల నుంచి పలువురు నటీనటులను మిక్స్ చేసి సినిమాను రూపొందించేలా జకన్న మాస్టర్ ప్లాన్ చేశాడట. ఈ క్రమంలోనే ఒక్కొక్కరికి సంబంధించిన సన్నివేశాలు మెల్లగా షూట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి లిస్టులో ఉన్నవారిలో ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. మిగతా వారంతా ఈ సినిమాల్లో నటిస్తున్నారా.. లేదా.. నిజంగానే ఈ లిస్టు రాజమౌళి చేశాడా.. తెలియాల్సి ఉంది.