సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న మూవీ ఎస్ఎస్ఎంబి 29. ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కనుంది. ఈ గ్లోబల్ ట్రోటర్ సినిమా 2027 లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కెన్యాలో జరుగుతున్న క్రమంలో.. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్.. మహేష్ తో కలిసి సినిమాల్లో సందడి చేస్తున్నారు. అయితే.. రాజమౌళి సినిమా విషయంలో చాలా సీక్రెట్ మైంటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ పుట్టినరోజు అయిన కేవలం ప్రీ లుక్ ను మాత్రమే రిలీజ్ చేసి నవంబర్లో అప్డేట్ ఇస్తామంటూ ఊరించాడు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది.
ఆఫ్రికన్ అడవుల్లో ఎక్కువ సినిమా షూట్ సన్నివేశాలు జరగనున్నాయి. మహేష్ ఓ సూపర్ హీరో తరహాలో సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం. దీనికి తోడు హిందూ పురాణాలకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ కూడా సినిమాలో కనిపించనుందట. ప్రస్తుతం కెన్యలో షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్కెటింగ్ స్ట్రాటజిని కూడా రాజమౌళి అక్కడి నుంచి ప్రారంభించాడు. ఓ సినిమాను ఎలా మార్కెటింగ్ చేయాలి.. పబ్లిసిటీ చేయాలన్నది ఆయనకు తెలిసినంత మరెవరికి తెలియదు. తాజాగా జక్కన్న ఎస్ఎస్ఎంబి 29 యూనిట్ తో కలిసి కెన్యా ప్రైమ్ క్యాబినెట్ సెక్రటరీ ముసలియ ముదవాడిని మీట్ అయ్యాడు.
ఈ సందర్భంగా రాజమౌళి ఆయనకు ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను.. తెరకెక్కిస్తున్న తీరు.. రిలీజ్ ప్లాన్ గురించి వివరించాడట. ఈ క్రమంలోనే ముసలియ ముదవాడి ప్రశంసల వర్షం కురిపించాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్‌గా మారుతుంది. ప్రపంచంలోనే అతి గొప్ప దర్శకులు రాజమౌళి ఒకరంటూ.. ఆయన పోస్టులో రాసుకొచ్చాడు. అంత గొప్ప దర్శకుడి సినిమాకి కేన్య వేదిక కావడం సంతోషంగా ఉందని.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు సినిమా చేస్తే డైరెక్టర్లలో ఆయన ఒకడు.. రెండు దశాబ్దాల నుంచి దర్శకుడుగా రాణిస్తున్న తను.. అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే కథనంతో ట్రెడిషన్స్ ప్రతిబింబించేలా సినిమాలు చేస్తున్నాడు. అలాంటి దర్శకుడు తన 120 మంది సిబ్బందితో కలిసి తన సినిమాను కెన్యా వేదికగా చేసుకొని రూపొందిస్తున్నాడు.. ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా 95% సన్నివేశాలు కాన్యాలోనే పూర్తి చేయనున్నాడంటూ వివరించాడు. ఈ మూవీ ఆషియాలోనే అత్యంత బిగ్ ప్రాజెక్టుగా నిలవనుందని.. 120 దేశాల్లో సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారని.. ముసలియ ముదవాడి తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. ఈ మీటింగ్ తో ప్రపంచ స్థాయిలో ఎస్ఎస్ఎంబి 29 సినిమా పబ్లిసిటీ ప్రారంభించేసాడు రాజమౌళి.
Kenya this past fortnight became the stage for one of the world’s greatest filmmakers, @ssrajamouli, the visionary Indian director, screenwriter, and storyteller whose works have captured the imagination of audiences across continents.
Rajamouli, with a career spanning over two… pic.twitter.com/T1xCGVXQ64
— Musalia W Mudavadi (@MusaliaMudavadi) September 2, 2025