మరోసారి విలన్ గా నాగ్ ఈసారి మన తెలుగు హీరో సినిమాలో ఛాన్స్..!

ప్రస్తుతం ఇండస్ట్రీ ఏదైనా సరే.. చిన్న సినిమాలు నుంచి పెద్ద సినిమాల వరకు ఏ ప్రాజెక్ట్ అయ్యినా పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో కీలకపాత్రలో లేదో.. క్యామియో రోల్లో నటించడానికి అసలు ఒప్పుకునే వారు కాదు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలు సైతం ఇతర సినిమాల్లో క్యామియో రోల్‌లో మెరవ‌డానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అంతేకాదు.. పలువురు స్టార్ హీరోస్ అయితే విలన్ పాత్రలో నటించడానికి కూడా ముందడుగు వేస్తున్నారు. అలా.. ఇటీవల కాలంలో చాలా మంది స్టార్ హీరోలు విలన్ పాత్రలో నటించి మెప్పిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు.. తమ ఫేవరెట్ హీరో ఎప్పుడు కనిపించని సరికొత్త షేడ్స్‌లో కనిపిస్తుంటే ఫ్యాన్స్ కూడా దానిని ఎంజాయ్ చేస్తున్నారు.

Ram Charan Send Wishes To 'Ever Inspiring' Nagarjuna On His 66th Birthday |  Telugu Cinema News - News18

టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఈ ట్రెండ్ మొదలైపోయింది. ఇక తెలుగులో సినీయ‌ర్‌ స్టార్ హీరో నాగార్జున ఇలాంటి సాహసాలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. విలన్‌ పాత్రలోనూ నటించి ఆడియ‌న్స్‌కు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. తనలోని వైవిధ్యమైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. అలా.. ఇప్పటివరకు నాగార్జున ఒకటి కాదు రెండు సినిమాల్లో నెగిటివ్ షేడ్స్‌లో మెరిశారు. ఒకటి రజనీకాంత్ హీరోగా నటించిన కూలి సినిమా కాగా.. మరొకటి యంగ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో మెరిసిన కుబేర. ఈ రెండు సినిమాల్లోనూ ఆయన విలన్‌గా ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. నాగ్‌.. ఎంత పెద్ద స్టార్ హీరోగా మారిన ఇలాంటి అడ్వెంచర్స్ చేయడానికి మాత్రమే ఎప్పుడూ వెనకాడరు. ఇప్పుడు పాత్రల విషయంలోనూ మరోసారి అది ప్రూవ్ చేశాడు.

Ram Charan and Sukumar reunite for 'RC17' | Telugu Movie News - Times of  India

ఇక తాజాగా నాగార్జున మరోసారి విల‌న్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈసారి మన టాలీవుడ్ టాప్ స్టార్ హీరో సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నాడని తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఎస్.. సుకుమార్, రాంచరణ్ పాన్‌ ఇండియన్ ప్రాజెక్ట్‌లో నాగార్జున ఒక శక్తివంతమైన నెగటివ్ షేడ్స్ లో మరవనున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. సుకుమార్ అంటేనే ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్, స్ట్రాంగ్ క్యారెక్టర్జేషన్. ఆయన సినిమాల్లో హీరోలే కాదు.. విల‌న్‌ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి సుకుమార్ సినిమాల్లో చరణ్ హీరోగా, నాగార్జున విలన్ గా నటించడం అంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైపోయింది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గానీ.. నిజంగానే నాగార్జున సినిమాలో విలన్ గా నటిస్తే మాత్రం రిలీజ్ కాక‌ముందే సినిమాపై భారీ లెవెల్ లో హైప్‌ పెరుగుతుంది.