కాంతర చాప్టర్ 1 ఫ్రీ రిలీజ్.. గాయం భాధిస్తున్న స్నేహం కోసం తారక్.. !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దిరోజుల క్రితం ఓ యాడ్ షూట్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం ఏం లేదని.. త్వరలోనే ఆయన కోలుకుంటాడు అంటూ టీం వివరించారు. దీంతో ఫ్యాన్స్ టెన్షన్ నుంచి రిలీఫ్ అయ్యారు. అయితే.. ఈ గాయం .రిగిన తర్వాత బయటకు రాని ఎన్టీఆర్.. తన స్నేహితుడు రిషబ్ శెట్టి కోసం తాజాగా కాంతారా చాప్టర్ 1 ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయ‌న మెరిశారు, రిష‌బ్ హీరోగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్స్‌లో గ్రాండ్గా రిలీజ్ కానుంది,

ఇప్పటికే బెంగళూర్‌, కొచ్చిలో ప్రమోషన్స్ ను కంప్లీట్ చేసిన రిషబ్.. హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్‌ను స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. ఈ వేడుకకు చాలా సింపుల్ గా వచ్చిన తారక్.. కూర్చునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ కనిపించాడు. భుజం దిగువన చేయి పెట్టుకొని నొప్పిని ఫీలైన సీన్స్ చాలా క్లియర్ గా కనిపించాయి. అంతేకాదు.. స్టేజ్ పై సినిమా గురించి చెబుతూ.. నుంచోలేకపోతున్న అంటూ నొప్పిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తార‌క్‌క సంబంధించిన ఆ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఫ్యాన్స్ ఎన్టీఆర్ విషయంలో బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇబ్బంది పడడం అసలు చూడలేకపోతున్నామని.. త్వరగా తారక్‌ కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. కాంతారా చాప్టర్ 1 లో తార‌క్ ఓ స్పెషల్ రోల్‌లో మెర‌వ‌నున్నాడని సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. రిషబ్ శెట్టి అభిమానించే నటుల్లో మాత్రం ఖచ్చితంగా తారక్ ఉంటాడు. బహుశా.. ఆ కారణంతోనే తారక్ గాయం బాధిస్తున్న అంత నొప్పిలోను ఇబ్బంది పడుతూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఇక తన పరిస్థితి దృష్ట్యా.. త్వరగానే స్పీచ్‌ను ముగించి వెనుతిరిగారు. 2022లో వచ్చిన కాంతార సినిమాకు సీక్వల్గా ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇక‌ ట్రైలర్ చూస్తే సినిమాపై ఆసక్తి అంతకంతకు పెరుగుతుంది. సినిమా విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. కథను మాత్రం రిలీజ్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. మరి స్టోరీ ఏంటో.. రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.