డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్‌గా.. హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుడుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. ఈ సినిమాని కబీర్ సింగ్ గా బాలీవుడ్‌లోను రీమేక్ చేసి.. బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాదు.. ఇటీవల యానిమల్ మూవీతో బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు మోత మోగించాడు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిందో తెలిసిందే. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ప్రాజెక్టులపై విపరీతమైన బజ్ నెలకొంది.
ప్రస్తుతం సందీప్.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. దాదాపు రెండు ఏళ్ల క్రితం అఫీషియల్‌గా ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు.. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా.. జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జయంబు నిశ్చయమురా టాక్ షోలో డైరెక్టర్ ఆర్జీవి తో కలిసి సందీప్ సందడి చేశాడు. వీళ్ళిద్దరికీ సంబంధించిన ఎపిసోడ్ జీ ఫైవ్ లో ట్రెండింగ్‌గా మారింది. ఈ టాక్ షోలో సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. రాంగోపాల్ వర్మ ఎన్నో విషయాల్లో నాకు గురువు. ఆయన సినిమాలు చూసి తెలియని విషయాలు ఎన్నో నేర్చుకున్నా.
ఇక సత్య సినిమాను దాదాపు 60 సార్లు చూసా. ఈ మూవీ చూసే ఎడిటింగ్ నేను నేర్చుకున్న అంటూ సందీప్ కామెంట్స్ చేశారు. అలాగే.. ఇప్పటివరకు నేను చూసిన సినిమాల్లో బాహుబలి 2 ఇంటర్వెల్ హైలెట్. ఆ సినిమాకు మించిన ఇంటర్వెల్ సీన్ ఇప్పటివరకు మరొకటి లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత నా స్టూడియోకి వచ్చే అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ సీన్ చూసా.. ప్రేక్షకులకు అసలు ఇది నచ్చుతుందా అనే భయం వేసింది. ఇంటర్వెల్ సీన్స్ అంత గొప్పగా ఉండాలని రాజమౌళి చూపించారంటూ వివరించాడు. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డివంగా కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి.