అనుష్క ప్రధాన పాత్రలో.. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఘాటి. ఈనెల 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఇక ఈ సినిమా కోసం వీరమల్లు సినిమాను క్రిష్ వదిలేసాడంటూ.. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాను పక్కన పెట్టేసి ఘాటి సినిమా చేయడం ఏంటంటూ.. పవన్ అభిమానులతో పాటు పలువురు ఆడియన్స్ సైతం ఆయనపై మండిపడ్డారు. అయితే తాజా ప్రమోషన్స్‌లో క్రిష్ వీరమల్లును వదిలేయడానికి అసలు కారణమేంటో రివిల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అది పక్కన పెడితే.. ప్రస్తుతం ఘాటీ ఫస్ట్ రివ్యూ నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది.
ఇంతకీ అసలు సినిమా స్టోరీ ఏంటి.. కంటెంట్ ఎలా ఉంది.. క్రిష్ డైరెక్షన్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దాం. ఓ అడవి ప్రాంతంలో బతికే వ్యక్తులు.. గంజాయి పండిస్తూ జీవనాన్ని వెల్లడిస్తూ ఉంటారు. వాళ్ల జీవనాధారమైన ఈ పంట వల్ల ఎలాంటి అనర్ధాలు జరిగాయి.. దీంతో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే కంటెంట్ తో సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాలో అనుష్క ఎప్పటిలాగే తన పర్ఫామెన్స్ తో అదరగొట్టిందని చెప్తున్నారు. కృష్ సైతం తను చెప్పాలనుకున్న కథను డిఫరెంట్గా స్క్రీన్ పై చూపించే ప్రయత్నాలు చేశాడు.
ఈ క్రమంలోనే సినిమా కొంతమేరకు ఆడియర్స్‌ను ఆకట్టుకుంటుందని సమాచారం. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త డల్ గా అనిపిస్తుందట. ఇప్పటికే క్రిష్ సినిమా పై పూర్తి ధీమా వ్యక్తం చేసాడు. ఈ క్రమంలోనే సెకండ్ హాఫ్ లో వచ్చే మూడు ఎపిసోడ్స్ ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకునేలా డిజైన్ చేశారని టాక్. అంతేకాదు మేకర్స్ సైతం ఈ సీన్స్ చాలు.. సినిమాను స్ట్రాంగ్ గా నిలబెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి అనుష్క ఈ సినిమాల తన విశ్వరూపం చూపించిందని.. ఇప్పటికే క్రిష్ వివరించిన సంగతి తెలిసిందే. ఇక క్రిష్ ఈ కథను అసలు ఆడియన్స్ ఊహకందని రేంజ్‌లో తెరకెక్కించాడట. మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుంటుందో.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.