సౌత్ స్టార్ హీరోగా లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుని దూసుకుపోతున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక హీరో గానే కాదు.. మరో పక్క ప్రొడ్యూసర్ గాను మారి.. లోక చాప్టర్ 1 చంద్ర.. సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొత్తలోక పేరుతో టాలీవుడ్‌లోనూ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో ఓ డైలాగ్ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది అంటూ నెటింట విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే దుల్కర్ నిర్మాణ సంస్థ వ్యఫరర్ ఫిలిమ్స్ అఫీషియల్ గా దీనిపై స్పందిస్తూ క్షమాపణలు తెలియజేసింది. ఈ సినిమా క్లైమాక్స్‌లో విలన్ పాత్రధారి బెంగళూరుకు చెందిన అమ్మాయిల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు విమర్శలు తెగ వైరల్ గా మారాయి.
అంతేకాదు.. సినిమాలో దగ్గర్ అనే పదాన్ని తరచుగా వాడడం కూడా అస్సలు నచ్చలేదని.. చాలా మంది సోషల్ మీడియా యూజర్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటక కు చెందిన ప్రజలు సోషల్ మీడియాలో తీవ్రంగా దీనిపై స్పందించడంతో.. దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ అఫీషియల్ గా క్షమాపణలు తెలియజేస్తూ ప్రకటన రిలీజ్ చేసింది. వ్యఫరర్ ఫిలిం తరఫున వచ్చిన ఆ ప్రకటనలో వాళ్లు ఇలా వెల్లడించారు. మా సినిమాలోని ఓ సంభాషణ కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని విషయం మా దృష్టికి వచ్చింది.. ఈ విషయంపై మేము నిజంగా బాధపడుతున్నాం. ఎవరిని కించపరిచే ఉద్దేశంతో మేము అది చేయలేదు.. ఆ కాన్వర్జేషన్ వీలైనంత త్వరగా సినిమా నుంచి తొలగించేస్తాం.. లేదా మార్చుతాం.. మేము కలిగించిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు అంటూ క్లారిటీ ఇచ్చారు.
దయచేసి మా క్షమాపణ అంగీకరించండి అని మూవీ టీం వివరించారు. ఈ సినిమా డామినిక్ అరుణ్ డైరెక్ట్ చేయగా.. హీరోయిన్గా కళ్యాణి ప్రియదర్శి మెరిసింది. నస్లిన్ ప్రధాన పాత్రలో మెరిసిన ఈ సినిమా.. 2025 ఆగస్టు 28న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇక తెలుగు, మలయాళం లో గ్రాండ్ గా రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఈ క్రమంలోనే వివాదం వెలుగులోకి రావడంతో.. వెంటనే మూవీ యూనిట్ రియాక్ట్ అవుతూ బాధ్యతాయుతంగా క్లారిటీ ఇచ్చారు. వెంటనే మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ వివాదం ఇంతటితో సద్దుమణుకుతుందా.. లేదా కన్నడ ప్రజలు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో.. చూడాలి.