కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు ఆడియన్స్‌లో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఆయన లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది. దుల్కర్ సల్మాన్ 41వ మూవీ గా వస్తున్న ఈ మూవీ.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకు డైరెక్టర్‌గా రవి నేలకుడిటి వ్యవహరిస్తుండగా.. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్ గా చేయనున్నారు. ఈ బ్యానర్ లో 10వ సినిమా కావడంతో వాళ్లకు మరింత స్పెషల్ గా మారింది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గ్రేట్ హ్యూమన్ డ్రామా తో ప్రేమ కథగా తెరకెక్కనున్న ఈ సినిమా ఎమోషనల్ గా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని.. కచ్చితంగా కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు.
ఇక సినిమాలో దుల్కర్ సరసన హీరోయిన్గా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే మెరవనుంది. ఈ విషయాన్ని కొద్ది గంటల క్రితం మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. పూజా హెగ్డే ఇప్పటికే షూటింగ్లో సందడి చేస్తుందని చూపించే ఓ స్పెషల్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో పూజ స్కూటీ డ్రైవ్ చేస్తుండగా.. దుల్కర్ వెనక కూర్చొని వారి మ్యాజికల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేసే సీన్ అది. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. అంతే కాదు దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఫస్ట్ కొలాబరేషన్ అద్భుతంగా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఓ హాట్‌వార్మింగ్ లవ్ స్టోరీ గా డైరెక్టర్ రవి నేలకుడిటి దీనిని డిజైన్ చేశారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకు పనిచేయనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గోస్వామి.. డిఓపి గా, జీవి ప్రకాష్ కుమార్.. మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేయనున్నాడు. గ్రాండ్ పాన్ ఇండియన్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక సినిమా షూట్‌ను కంప్లీట్ చేసుకుని రిలీజ్ టైంకి ఎలాంటి హైన్‌పు క్రియేట్ చేసుకుంటుందో.. రిలీజ్ తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.