టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్దంన్నర కాలం పాటు ఏలేసిన అనుష్క ఎలాంటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుందో తెలిసిందే. ఒక స్టార్ హీరో రేంజ్ లో ఇమేజ్ను దక్కించుకున్న ఈ అమ్మడితో.. లేడీ ఓరియంటెడ్ సినిమాలను సైతం మేకర్స్ ఇష్టపడుతూ ఉంటారు. అయితే.. గత కొంతకాలంగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎప్పుడు అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా క్రిష్ డైరెక్షన్‌లో ఘాటి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. ఇక సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు టీం.
ఈ సినిమాతో అమ్మడికి ఎలాంటి గుర్తింపు వస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. కాగా.. సినిమా పై ఇప్పటివరకు పెద్దగా బజ్ లేకపోవడంతో.. ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. అయితే.. ప్రమోషన్స్‌లోనూ అనుష్క మాత్రం పాల్గొనక పోవడానికి ఓ కారణం ఉందంటూ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఆమె భారీ వెయిట్ పెరిగిపోయిందని.. దీనివల్ల బయట పెద్దగా కనిపించడం లేదు.. కేవలం సినిమా షూట్స్‌లో మాత్రమే సందడి చేస్తుందని సమాచారం. ఆమె స్క్రీన్ మీద కూడా ఒరిజినల్ గా కనిపించడం లేదట. కొన్ని టెక్నాలజీలతో సీజీ వర్క్‌ని ఉపయోగించి సన్నగా కనపడేలా తీర్చిదిద్ది.. సినిమాలను చూపిస్తున్నట్లు టాక్.
నిజానికి ఆమె ఇప్పుడు 100 కిలోలకు పైన బరువుతో ఉందని.. అందుకే అనుష్క బయటకు రావడానికి పెద్దగా ఆసక్తి చూడటం లేదని సమాచారం. ఈ క్రమంలోనే కేవలం ప్రమోషన్స్ అనే కాదు.. పర్సనల్ గాను బయట ఎక్కడ కనిపించడం లేదట. రీసెంట్గా ఓ సినిమా డైరెక్టర్ సైతం తనతో సినిమా చేయాలని భావించినా.. తాను ఇప్పుడు కథ వినే పొజిషన్లో లేనని.. ఓవర్ వెయిట్ కారణంగా ప్రాజెక్టులను కన్ఫామ్ చేయలేకపోతున్నానని క్లారిటీ ఇచ్చేసిందట. ఇక లైవ్ స్టేషన్ సర్జరీ చేయించుకున్న తర్వాత తను కొత్త సినిమాలకు కమిట్ అవుతానని చెప్పినట్లు సమాచారం. ఏదైనా అనుష్క కేవలం ఒక్క సినిమా కోసం రిస్క్ చేసి ఓవర్ వెయిట్ పెరిగిపోయిందని.. జీరో సై సినిమా కోసం ఇంతగా రిస్క్ చేయకుండా ఉండాల్సిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.