చిరు రిజెక్ట్ చేసిన మూవీతో ఫస్ట్ కమర్షియల్ హిట్ కొట్టిన నాగ్ ఆ మూవీ ఇదే..!

సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోలుగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. సినీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా.. టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. నటనతో ఆడియన్స్‌ను మెప్పించి కమర్షియల్ సక్సెస్ లు అందుకుంటేనే స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలుగుతారు. అలా.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ సాధించిన వారిలో నాగార్జున ఒకడు. ఏఎన్ఆర్ నటవారసుడుగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. సొంత టాలెంట్‌తోనే టాలీవుడ్ కింగ్‌గా ఎదిగాడు. ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించి ఆడియన్స్‌ను మెప్పించాడు.

Aakhari Poratam Telugu Full Length Movie || Nagarjuna, Sridevi, Suhasini ||  Telugu Hit Movies

రొమాంటిక్ హీరోగా మన్మధుడు ట్యాగ్‌ను సొంతం చేసుకున్న నాగ్‌.. కేవలం రొమాంటిక్ సినిమాలోనే కాదు.. మాస్, క్లాస్, డివోషనల్, హిస్టారికల్ ఇలా అన్ని వైవిధ్య‌త‌ల‌ను చూపించాడు. ఇటీవల కుబేర, కూలి సినిమాలతో నెగిటివ్ షేడ్స్‌లోను నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే చిరు రిజెక్ట్ చేసిన కథతోనే నాగార్జునకు ఫస్ట్ కమర్షియల్ హిట్ పడిందంటూ న్యూస్ వైరల్‌గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. 1967లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సుడిగుండాలు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన‌ నాగార్జున.. తర్వాత 1986లో విక్రమ్ సినిమాతో హీరోగా మారాడు. అయితే.. ఈ సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయిడు.

Birthday Special: Celebrating Chiranjeevi, The 'King of Dance' |  Filmfare.com

నాగార్జునకు మొట్టమొదటి కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన సినిమా ఆఖరిపోరాటం. కాగా.. ఈ సినిమా మొదటి నాగార్జునకు రాలేదు. దీని వెనుక‌ పెద్ద కథ నడిచింది. శ్రీదేవి హీరోయిన్‌గా రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాకు అశ్విని దత్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. కాగా మొద‌ట ఈ సినిమా కోసం చిరంజీవిని భావించారట. అందులో భాగంగానే చిరును అప్రోచ్ కాగా.. ఆయన సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. అంతా ఓకే అనుకునే సమయానికి చిరంజీవి వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండడంతో నేను ఈ సినిమా ప్రస్తుతం చేయలేనని హోల్డ్ లో పెట్టాడట. దాంతో వెంటనే నాగార్జున సంప్రదించి.. ఈ సినిమాకు ఒప్పించారు. నాగ్‌ వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. సైట్స్ లోకి దిగాడు. ఇక నాగార్జున, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్‌ అందుకని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసి పెట్టింది. అలా.. చిరు రిజెక్ట్ చేసిన మూవీతో నాగార్జున ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు.