సినీ ఇండస్ట్రీలో ఏదైనా మూవీకి సీక్వెల్ వస్తుందంటే చాలు ఆడియన్స్ లో మొదటి నుంచి మంచి హైప్ నెలకొంటుంది. కచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత జస్ట్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కొల్లబడుతుంది. అయితే.. ఆ సీక్వెల్ మిస్ ఫైర్ అయితే మాత్రం ఘోరమైన రిజల్ట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం వార్ 2 పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. టాలీవుడ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 రిలీజ్‌కు ముందు భారీ అంచనాలనే నెలకొల్పింది.
ఇక ఇది ఓ బాలీవుడ్ మూవీ కావడం.. ఇందులో ఎన్టీఆర్ విలన్ పాత్రలో మెరవడంతో.. సినిమా పై టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే.. తెలుగు వర్షన్ కోసం హైదరాబాద్‌లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. తారక్ రెండు కాలర్లు ఎగరేసి ఈ సినిమాతో కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయం అంటూ ఎప్పుడైతే కామెంట్స్ చేశాడో వెంటనే సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఎన్టీఆర్ స్పీచ్ టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీగా తెగ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్ లో వస్తాయని అంతా భావించారు. కానీ.. అసలు వర్కౌట్ కాలేదు. తారక్ రేంజ్ కు అతి దారుణమైన ఓపెనింగ్స్గా ఈ సినిమా నిలిచింది.
ఇక బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ క్రేజ్.. రెండవ రోజు పబ్లిక్ హాలిడే అడ్వాంటేజ్ కూడా కలిసి రావడంతో.. రూ.42 కోట్ల నెట్ వసూళ్లు దక్కించుకుందట. అదేవిధంగా.. కృష్ణాష్టమి కావడంతో ఈరోజు కూడా హిందీలో మంచి వసూళ్లే దక్కడున్నాయని అంటున్నారు. ఇక తెలుగు వర్షన్ వసూళ్ల విషయానికొస్తే.. ఫస్ట్ డే సినిమాకు ఊహించిన రేంజ్‌లో కలెక్షన్స్ రాలేదు. అయితే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తారక్ కు ఉన్న క్రేజ్.. దానికి తోడు నిన్న పబ్లిక్ హాలిడే కావడం తో కాస్త డీసెంట్ వసూళ్లే దక్కాయి. కానీ తెలంగాణలో మాత్రం సినిమా కలెక్షన్ల విషయంలో ఎలాంటి గ్రోత్ కనిపించలేదు. ఇలా రెండో రోజు కూడా తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండో రోజు కేవలం రూ.4 కోట్ల షేర్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక నేడు కూడా కృష్ణాష్టమి హాలిడే అయినా.. అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం కాస్త కూడా వర్కౌట్ కాలేదు. ఒకచోట కూడా బుక్ మై షో యాప్ లో ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపించడం లేదు. హైదరాబాద్ లాంటి సిటీల్లో సైతం తెలుగు వర్షన్ కంటే హిందీ వర్షన్ కి ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్ జరగడం షాక్. ప్రముఖ ప్రొడ్యూసర్ నాగ వంశీ సినిమా రూ.90 కోట్లకు సొంతం చేసుకోగా.. ఈ సినిమా ప్రస్తుతం ఉన్న టాక్ తో రూ.60 కోట్లు కూడా సంపాదించుకునేలా లేదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.