టాలీవుడ్లో టికెట్ ధరల పెంపుపై.. ఇప్పుడు కాదు ఎప్పటినుంచో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు వినోదం కోసం చూసే సినిమా ఇప్పుడు ఆర్థికంగా భారీ నష్టానికి కారణమవుతుందంటూ ఆడియన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేసిన సందర్భాలు.. ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 టాలీవుడ్ టికెట్ల రేట్ల విషయంలోనూ విమర్శలు మొదలయ్యాయి. సాధారణంగా సినిమా టికెట్ ధరలు పెరగడానికి ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో కారణాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో సినిమాను ప్రొడ్యూసర్లు తెరకెక్కించడం ఒక కారణమైతే.. డిజిటల్, సాటిలైట్ హక్కులు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ థియేట్రికల్ కలెక్షన్ ద్వారా కూడా లాభాలను అర్జించాలనే నిర్మాతల అత్యాశ కూడా ఒక కారణం.
ఇతర భాషల నుంచి వచ్చే డబ్బింగ్ సినిమాలకు కూడా టాలీవుడ్‌లో భారీగా టికెట్ ధరలు పెంచడం ఒక అలవాటుగా మారిపోయింది. వార్ 2 లాంటి బడా సినిమాలకైతే ఇక చెప్పనవసరం లేదు. వాళ్లకు నచ్చినట్లుగా టికెట్ ధరలు నిర్ణయించేసి.. రిలీజ్ చేసేస్తున్నారు మేకర్స్. ఓటిటి ప్లాట్ఫారంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత థియేటర్లోకి వెళ్లి సినిమా చూడాలని ఆసక్తి కూడా ఆడియన్స్‌లో తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే నష్టాలు పూడ్చుకోడానికి సైతం టికెట్ ధరలను పెంచుతూ వస్తున్నారన్నది మరో వాదన. ఇక ఏదేమైనా సరే ఒకే సినిమాకు వేరువేరు భాషల్లో ఈ రేంజ్ లో ధరల మార్పులు చూడడం ఆడియన్స్‌కు షాక్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా.. తెలుగు ఆడియన్స్‌ను దోచుకోవడమే లక్ష్యంగా అన్ని చోట్ల కంటే భారీగా టికెట్ రేట్లు ఫిక్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే.. టాలీవుడ్ ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తెలుగు సినిమా పట్ల ఒక నెగటివ్ భావన ఏర్పడుతుందని.. సాధారణ జనం ఎలా ఫ్యామిలీతో కలిసి సినిమా ఎలా చూస్తారంటూ మండిపడుతున్నారు. నిరంతరంగా టికెట్ ధరలు ఇలాగే పెరుగుతూ పోతే తెలుగు పరిశ్రమకే భారీ నష్టం వాటిల్లుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరల పెంపు వార్ 2 లాంటి బిగ్ పాన్ ఇండియన్ సినిమాల విషయంలోనే జరిగిన.. దీని ప్రభావం కచ్చితంగా టాలీవుడ్లో చిన్న సినిమాల పైన కూడా ఉంటుందని.. ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కొత్త సినిమా చూడడం కంటే ఓటిటిలో రిలీజ్ అయిన తర్వాత చూడవచ్చని ఆడియన్స్ ఆగిపోతారని.. అప్పుడు కచ్చితంగా చిన్న సినిమాలపై కూడా ప్రభావం ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న వార్ 2 సినిమాను ఐమాక్స్, డిపాక్స్, డాల్బీ మరియు ఇతర ప్రీమియర్ ఫార్మేట్ లో రిలీజ్ అయినట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే టికెట్ ధరల పెంపుదల విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఇకపై ఆయన టికెట్ ధరలు తగ్గించేలా ప్లాన్ చేస్తారో.. లేదో.. చూడాలి.