టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ టు డైరెక్షన్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై.. ప్రతిష్టాత్మకంగా సినిమా రూపొందింది. ఇక.. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం జోరు చూపించడం లేదంటూ .. గత కొంతకాలంగా అభిమానుల నుంచి నిరాశ వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు అదిరిపోయే అప్డేట్లు రివిల్ అయ్యాయి. ఎన్టీఆర్, హృతిక్‌లపై షూట్ చేసిన మోస్ట్ అవైటెడ్ సాంగ్ సలాం అనాలి.. సాంగ్ గ్లింప్స్ మరికొద్ది క్షణాల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
ఇక బాలీవుడ్‌లో సినిమా రిలీజ్ కంటే ముందే.. వీడియో సాంగ్ రిలీజ్ చేసి అనవాయితీ ఉన్న బాలీవుడ్.. ఈ సాంగ్ విషయంలో మాత్రం యష్ రాజ్ ఫిలిమ్స్ కొత్త స్టేటస్ మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేసి.. ఫుల్ సాంగ్ ధియేటర్లో చూసేలా ఆసక్తి కల్పించే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ అప్డేట్ తో పాట్టే.. వార్ 2 తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ కూడా షేర్ చేశారు. ఈ సినిమాను టాలీవుడ్లో రిలీజ్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ.. సోషల్ మీడియా వేదికగా దీన్ని అఫీషియల్ గా ప్రకటించారు.
ఈ ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం. అనుమతులు వచ్చిన తర్వాత.. పూర్తి డీటెయిల్స్ ప్రకటిస్తామంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ గత సినిమా దేవరను కూడా.. తెలుగులో నాగ వంశీనే రిలీజ్ చేశాడు. ఈ విషయాన్ని నాగ వంశీ ప్రస్తావిస్తూ.. రెండు రాష్ట్రాల్లో దేవరకు మించిన భారీ రిలీజ్ వార్ 2కు ఉంటుందని.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు హామీ ఇచ్చాడు. అలాగే బుకింగ్స్ కూడా ఆదివారం ఓపెన్ అవుతాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు గుడ్ న్యూస్ లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అందించారు.