ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. AA 22 రనింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని హాలీవుడ్ రేంజ్‌లో టీం ప్లాన్ చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ ఏజెన్సీ పనిచేస్తుందంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. హాలీవుడ్ పవర్ హౌస్ గా పిలుచుకునే అలెగ్జాండ్రా వీక్సొంటి ఈ టీంలో సందడి చేశారు. దీంతో.. ఈమె ఎవరంటూ బన్నీ ఫ్యాన్స్ ఇంటర్నెట్లో తెగ సెర్చింగ్లు ప్రారంభించారు.
AA 22 ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో మార్కెట్ క్రియేట్ చేయడం కోసం.. హాలీవుడ్ స్టూడియోలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే.. హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ కనెక్ట్ మార్క్స్ ఇన్.. అల్లు అర్జున్ కోసం పని చేసేందుకు సిద్ధమైందట. ఈ ఏజెన్సీకి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ గా అలెగ్జాండ్రా విక్సోండి వ్యవహరించరున్నారు. రీసెంట్గా.. ఫస్ట్ టైం ఇండియాకు వచ్చిన ఈ అమ్మడు.. ముంబైలో బన్నీ, అట్లీని కలిసి.. తమ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రమోషన్ చేయడం పై చర్చలు నిర్వహించినట్లు సమాచారం.
కథలోనే అవతార్, ఫస్ట్ అండ్ ఫ్యూరియస్, డ్యూయల్, జురాసిక్ వరల్డ్, బార్బీ లాంటి ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలకు మార్కెటింగ్ బాధ్యతలు చూసుకుంది. AA 22 టీం హాలీవుడ్ మార్కెటింగ్ బాధ్యతలను ఆమెకు అప్పజెప్పినట్లు సమాచారం. అమెరికా, మెక్సీకో ఇలా హలీవుడ్ రేంజ్‌లో ఉన్న ఇతర దేశాలన్నింటిలోనూ ఈ సినిమాకు అలెగ్జాండ్రనే ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో.. ఈ సినిమాతో బన్నీ ఇంటర్నేషనల్ లెవెల్ లో సత్తా చాటుకోవడం పక్కా. బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.