టాలీవుడ్ కింగ్ నాగార్జున నేడు తన 66వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోని సినీ ప్రముఖులతో పాటు.. సోషల్ మీడియా వేదికగా అభిమానుల విషెస్ వెలువుతుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో నాగార్జునకున్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరు పదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోలా తన ఫిట్నెస్, అందంతో కుర్రకారును ఆకట్టుకుంటున్న నాగ్.. కెరీర్ పరంగా మంచి ఇమేజ్ దక్కించుకున్నాడు. ముఖ్యంగా రొమాంటిక్ యాంగిల్ లో తనకంటూ స్పెషల్ ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలోనే నాగార్జున.. మన్మధుడిగా బిరుదు దక్కించుకున్నాడు.
ఇప్పటికీ ఓ యంగ్ హీరోయిన్ సరసన ఆయన నటిస్తున్నాడు అంటే ఎలాంటి అసౌకర్యము లేకుండా.. చాలా సులువుగా రొమాంటిక్ హీరోలా న్యాచురల్‌గా ఆడియన్స్‌కు కనెక్ట్ అయిపోతాడు. కారణం.. ఆయనకు లేడీస్‌లో ఉన్న ఫ్యాన్ ఫాలియింగ్ అనడంలో సందేహం లేదు. ఈ తరం యూత్‌కు సైతం నాగార్జున నవమన్మధుడే. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆయనకు ఇద్దరు కొడుకులు. నాగచైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న తండ్రికి తగ్గ ఇమేజ్ను మాత్రం క్రియేట్ చేసుకోలేకపోయారు. కానీ.. నాగార్జున మాత్రం ఇప్పటికే ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానంలో కొనసాగుతూనే ఉన్నాడు.
ఆయన ఛరిష్మా, పర్సనల్ బ్రాండింగ్ ఎంత బలమైన దీన్ని బట్టి అర్థమవుతుంది. కేవలం రొమాంటిక్ సినిమాలే కాదు.. మాస్, క్లాస్, రొమాంటిక్, డివోషనల్ ఇలా.. తన కెరీర్‌లో అన్ని వైవిధ్యమైన సినిమాల్లోను మెరిసి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక తాజాగా.. కుబేర, కూలి సినిమాల్లో నెగిటివ్ షేడ్స్‌లోను ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్ని షేడ్స్‌లో నటించిన కూడా ఆయనను ఫ్యాన్స్ మాత్రం మన్మధుడుగానే పిలుచుకుంటూ ఉంటారు. నాగార్జునకు అందిన ఈ రొమాంటిక్ ట్యాగ్ను మరో హీరో టచ్ చేయలేకపోయాడు అనడం లో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే నాగర్జున టాలీవుడ్ మన్మధుడిగా దూసుకుపోతున్నాడు.