టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినిమా అయినా.. బడ్జెట్ ఎంతైనా.. తనదైన టేకింగ్ తో ఎమోషనల్‌గా ఆడియన్స్‌ను కనెక్ట్ చేసుకోవడంలో దిట్టగా మారాడు రాజమౌళి. ఈ క్రమంలోనే ఆయన చేసే ప్రతి సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపిస్తూ. బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఎమోషనల్ సన్నివేశాలు, హీరో, హీరోయిన్ల ఎమోషన్స్.. అలాగే ఇతర నటినట్లు పాత్రలను సైతం హైలైట్ చేస్తూ తీయడంలో ఆయనను మరే డైరెక్టర్ టచ్ చేయలేరు అనంతగా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు రాజమౌళి. కాగా.. రామ్ చరణ్ రాజమౌళి డైరెక్షన్‌లో మగధీర సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఇది చరణ్ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సినిమాలో గుర్రంతో రాంచరణ్ ఎమోషనల్ సీన్ ఆడియప్స్‌ను ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ఆకట్టుకుంది. అయితే.. రాజమౌళి దీని గురించి ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఆ సీన్ అంత ఎమోషనల్ గా రావడానికి చిరంజీవి నటించిన కొదమ సింహం సినిమానే కారణమంటూ చెప్పుకొచ్చాడు. నేను మెగాస్టార్ గారికి చాలా పెద్ద ఫ్యాన్.. అప్పట్లో థియేటర్‌లో కొదమ సింహం సినిమా చూశా. రౌడీలు చిరంజీవిని పీకలోతు ఇసుకలో పాతిపెట్టి వెళ్ళిపోతుండగా.. అక్కడ ఉన్న ఆయన గుర్రం తన నోటికి తాడు అందించి కాపాడుకుంది. ఆ సీన్ లో.. కష్టంలో నుంచి బయటకు వచ్చిన ఆయనకు గుర్రానికి పెద్దగా అనుబంధం లేదనిపించింది.
చాలా డిసప్పాయింట్ అయ్యా. నా దృష్టిలో అక్కడ అది గుర్రం కాదు.. ప్రాణాలు కాపాడిన ఒక ప్రాణం. మనకు సాయం చేసిన వ్యక్తికి కనీసం ధన్యవాదాలు చెప్పలేదని.. ఎమోషన్ కంప్లీట్ అవ్వలేదని అనిపించింది. అది నా మైండ్ లో అలాగే ఉండిపోయింది. ఓ ప్రేమికుడిగా నా ఎమోషన్ తృప్తి చెందలేదు అందుకే మగధీరలో ఇసుక ఊబిల కూరుకుపోయిన చరణ్.. బయటకు వచ్చిన తర్వాత గుర్రానికి తనదైన స్టైల్ లో ధన్యవాదాలు చెబుతాడు. కౌగిలించుకుంటాడు.. అలాగే కృతజ్ఞతలు చెప్పినట్టు ఒక స్నేహితుడిలా ఆ గుర్రాన్ని చూస్తూ ఉండిపోతాడు. అలా.. నా సినిమాలో బలమైన సన్నివేశాలు ప్రేక్షకుల ఆలోచనల నుంచి ఇన్స్పైర్ రాసినవే అంటూ రాజమౌళి వివరించాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారుతున్నాయి.