ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. సక్సెస్ సాధించాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇక ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటీనటులుగా మారాలని ఫిక్స్ అయిన తర్వాత.. ఎన్నో అవమానాలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. లేడీస్ అయితే కాస్టింగ్ కౌచ్ సంఘటన కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలా ఎప్పటికైనా ఎంతోమంది ముద్దుగుమ్మలు తమ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని ఓపెన్ గానే షేర్ చేసుకున్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న ఈ బ్యూటీ కూడా ఒకటి. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లోను ఈ అమ్మడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. కాగా టీవీ యాక్టర్ అయినప్పటికీ ఆడియన్స్ లో తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. జీవితం లో ఎదుర్కొన్న చీకటి రోజులను.. తాజా ఇంటర్వ్యూలో అందరితోనూ షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది.
ఇంతకీ ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు హిందీ సీరియల్ తో భారీ పాపులారిటీ దక్కించుకున్న రష్మీ దేశాయ్. తన పర్సనల్ లైఫ్ లో నుంచి చీకటి కోణాలను ఈ అమ్మడు తాజాగా అభిమానులతో పంచుకుంది. ఒకప్పుడు తను ఉండడానికి ఇల్లు కూడా లేదంటూ చెప్పుకోచ్చిన్న రష్మీ.. తన కారులోనే నాలుగు రోజులు గడిపాను అంటూ వివరించింది. నేను గతంలో ఒక ఇల్లు కొన్న.. రూ.2.5 కోట్ల లోన్ తీసుకున్న. మొత్తం అప్పు రూ.3.5 కోట్లు వరకు పెరిగిపోయింది. ఇక అంతా బాగుంది సజావుగా జరుగుతుందనే సమయానికి.. నేను చేస్తున్న షో ఆగిపోయింది. దీంతో.. ఈఎమ్ఐలకు ఇబ్బంది అయింది. నా పరిస్థితి ఎటు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయిందంటూ రష్మీ ఎమోషనల్ అయింది. షో ఆగిపోవడంతో వెంటనే తనని ఇల్లు ఖాళీ చేసేయమన్నారు. ఫ్యామిలీకి ఈ విషయం చెప్పడం ఇష్టం లేక లగేజీ మేనేజర్ ఇంట్లో పెట్టేసా అంటూ వివరించింది.
నాలుగు రోజులపాటు తన కారులోనే ఒంటరిగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చిన్న రష్మీ.. 16 ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నారంటూ వివరించింది. పదహారేళ్ల అప్పుడు ఆడిషన్స్ కోసం వెళితే వాళ్లు నాకు మత్తుమందు ఇవ్వాలని ప్రయత్నించారు. ఎలాగో తప్పించుకొని బయటపడ్డ అంటూ రష్మీ చెప్పుకొచ్చింది. ఇక తర్వాత ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని బి గ్రేడ్ సినిమాల్లో సైతం మెరిసింది. తను నటించిన సినిమాల కంటే టీవీ సీరియల్స్ ద్వారానే మంచి ఇమేజ్ తెచ్చి పెట్టుకుంది. ఇక తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం నా అప్పులన్నీ తీర్చేశానని.. కానీ ఆ స్టేజ్ కి రావడానికి నాకు చాలా టైమే పట్టింది అంటూ రష్మి దేశాయ్ వివరించింది. గతంలో ఓ సందర్భంలో అసలు లైఫ్ ఏంటి..? ఇలా టెన్షన్స్ పడుతూ బతుకే బదులు.. చచ్చిపోవడం బెటర్ అని ఎన్నోసార్లు అనుకున్నాను అంటూ వివరించింది. ప్రస్తుతం రష్మీ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.