వార్ 2 స్టోరీ లీక్.. తారక్ రోల్ విషయంలో ఆ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ‌నున్న యాక్షన్ థ్రిల్ల‌ర్ మూవీ వార్ 2. య‌ష్ రాజ్ ఫిల్మ్‌స్ బ్యాన‌ర్ పై ఆయాన్ ముఖ‌ర్జీ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాల్లో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడని టాక్ న‌డిచినా త‌ర్వాత తార‌క్ బ‌ర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా రిలీజైన టీజర్ తో ఈ వార్తలని తప్పు అని అంత క్లారిటీకి వచ్చేసారు. కారణం.. టీజర్‌లో ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్. నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతున్నాయి కబీర్. ఇండియాస్ బెస్ట్ సోల్జర్ నువ్వు.. బెస్ట్ రా ఏజంట్‌.. కానీ ఇప్పుడు కాదంటూ.. హృతిక్ రోషన్.. కబీర్ రోల్ గురించి ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్ లు చెప్తాడు. ఆ డైలాగ్ ద్వారా ఒకప్పుడు కబీర్ సోల్జర్ ఏజెంట్ కానీ.. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని అతన్ని పట్టుకోవడం కోసం ఎన్టీఆర్ పాత్ర ఎంట్రీ ఉంటుందని అర్థం వచ్చేలా టీజర్ చూపించారు.

సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఎన్టీఆర్ హీరోగా, హృతిక్ రోషన్ విలన్ గా అనిపిస్తాడు. అదే వాస్తవం అని.. తాజాగా క్లారిటీ వచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా తెర‌కెక్క‌నున్న వార్ 2.. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా బిజినెస్లు, ధియేటర్ల కేటాయింపు పనుల్లో మేకర్స్ బిజీ అయిపోయారు. థియేటర్లకు వెళ్లి వార్ 2 చూడాల‌ని ఫిక్స్ అవుతున్నారు. దానికి తగ్గట్టుగానే బిజినెస్, థియేటర్ల కేటాయింపులు స్పీడ్ అందుకున్నాయి. యూఎస్ థియేటర్లకు వార్ 2 సినాప్సిస్ అందించారు. అందులో.. కబీర్ విలన్. అతడి పట్టుకోవడానికి ఏజెంట్ విక్రమ్ గా ఎన్టీఆర్ వెళ్తాడు.

ఏజంట్ క‌బీర్.. భారత దేశపు అతి పెద్ద విలన్ గా మారాడు. దాంతో అతనికంటే పవర్ఫుల్ ఏజెంట్ అయిన విక్రమ్‌ను ఇండియన్ ఏజెంట్గా రంగంలోకి దింపారు. విక్రమ్ న్యూక్లియర్ లాంటోడు. కనికరం లేడీ ఓటర్మినేటర్. అతడు కబీర్ తలలోకి బుల్లెట్ దించాలని ఫిక్స్ అవుతాడు. ఇక విక్రమ్, క‌బీర్ మ‌ధ్య వార్.. క్రూరమైన యాక్షన్.. మరియు భావోద్వేగాలతో కూడిన యుద్ధం అనేది సినాప్సిస్‌ సారాంశంగా పేర్కొన్నారు. యూఎస్ థియేటర్లకు పంపిన సినాప్సిస్ వార్ 2లో ఎన్టీఆర్ విలన్ కాదు.. హీరో అని తేలిపోయింది. దీంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే వార్ 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.90 కోట్లు జరుపుకుంది.