ప్రభాస్, షారుక్ రికార్డ్స్ బ్రేక్ చేసిన కుర్ర హీరో.. బాక్సాఫీస్ బ్లాస్ట్..!

2025 ఫస్ట్ ఆఫ్ చూస్తుండగానే పూర్తయిపోయింది. అంతేకాదు.. ఈ ఫస్ట్‌హాఫ్ ఊహించిన రేంజ్ లో రిజ‌ల్ట్ అందుకోలేదు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వెలవెలలాడుతుంది. సెకండ్ హాఫ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా ప్రముఖ వెబ్సైట్ IMDB 2025 టాప్ ఇండియన్ సినిమాస్ లిస్ట్‌ను షేర్ చేసింది. అందులో అతి తక్కువ బడ్జెట్లో చిన్న సినిమా కలెక్షన్లలో మాత్రం 500 రెట్లు ఎక్కువగా దక్కించుకోవడం విశేషం. అంతేకాదు.. ప్రభాస్, సల్మాన్, షారుక్ లాంటి స్టార్ హీరోల సినిమాల రికార్డులను సైతం ఈ సినిమా బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ హీరో గురించి ఎక్కడ చూసినా న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది.

i>Chhaava</i> Review: Noteworthy Performance From Vicky Kaushal, But The  Film Doesn't Roar - 2.5 Stars

ఇంతకీ ఆ మూవీ ఏంటి.. ఆ హీరో ఎవరో ఒకసారి తెలుసుకుందాం. ఇటీవ‌ల బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సితార జమినేప‌ర్, సికందర్ లాంటి సినిమాలను వెనక్కు నెట్టి హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ హిస్టరీ క్రియేట్ చేసిన మూవీ మరేదో కాదు.. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేక్క‌ర్ తెరకెక్కించిన ఛావా. విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమా 2025 జనవరి 1 నుంచి.. జూలై 1 వరకు హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన మూవీస్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా 500 పర్సెంట్ లాభాలను తెచ్చి పెట్టింది.

రూ.809 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టి ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఛావాలో.. అక్షయ్ కన్నా, రష్మిక మందన, దివ్యదత్త, వినీత్ కుమార్ సింగ్, విక్కీ కౌశల్ ముఖ్యపాత్రలో మెరిశారు. రిలీజ్ కు ముందే భారీ క్రియేట్ చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ఇక ఈ IMDB జాబితాలో డ్రాగన్ రెండు స్థానంలో, దేవా మూడవ స్థానంలో, రైడ్ 2 నాలుగవ‌ స్థానంలో, రెట్రో 5వ స్థానంలో, ది డిప్లమార్ట్ ఆరవ స్థానంలో, యంపురాన్ ఏడవ‌ స్థానంలో, సితారే జమీన్ పర్ ఎనిమిదవ స్థానంలో, కేస‌రి చాప్టర్ 2.. తొమిద‌వ‌ స్థానంలో, విడాముయర్చి 10వ స్థానంలో నిలిచాయి.