అనాధగా పవన్.. వీరమల్లు ఫుల్ స్టోరీ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు.. పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్.. రిలీజ్‌కు మరి కొద్ది రోజుల సమయం మాత్ర‌మే మిగిలుంది. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరిస్తున్న ఈ మూవీ.. ఏ.ఎం. రత్నం ప్రొడ్యూసర్ గా జూలై 24న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ను పలకరించనుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రొడ్యూసర్ ఏ.ఏం. రత్నం.. సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. త‌ను పోషించిన రోల్ గురించి ఎన్నో విష‌యాలు చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో పవన్ పాత్ర పూర్తిగా కల్పితం అని.. హరిహర అనే పేరు విష్ణువు మరియు మహాశివుడికి ఇండికేషన్ గా ఉండేలా సెలెక్ట్ చేసుకున్నామని.. ఆ పాత్ర యొక్క ఆధ్యాత్మిక స్వభావాన్ని ప్రతిబింబించేలా హరిహర అనే పదాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. వరద టైం లో వదిలివేయబడిన ఓ బిడ్డను గుడిలో దత్తత తీసుకొని పెంచినట్టు.. ధర్మం మరియు భక్తితో పెరిగిన అనాధగా పవన్ ఈ రోల్లో కనిపించాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా స్టోరీ మొత్తం ఔరంగజేబుపై పోరాడే ఓ యుద్దగాథ‌గా తెరకెక్కిందని.. ఇందులో సనాతన ధర్మాన్ని నిలబెట్టే పోరాటమే కనిపిస్తుంది. ఈ పాత్రకు ఏ చరిత్రత్మక వ్యక్తులతో అసలు సంబంధమే లేదని ఇది పూర్తిగా ఒరిజినల్ పాత్రను అంటూ క్లారిటీ ఇచ్చాడు.

బాబి డియోల్, నాజర్, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు సినిమాల్లో కీలక పాత్రలో మెరవనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా.. ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. ఇక ప‌లు భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమా పవన్ ఏపీ డిప్యూటీ సీఎం గా వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. అదికూడా దాదాపు నాలుగుగేళ్ల గ్యాప్ తర్వాత పవన్ సిల్వర్ స్క్రీన్ పై మరవనున్న క్రమంలో సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఎప్పుడప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ పవన్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.