వార్ 2 కోసం ఎన్టీఆర్ బిగ్ రిస్క్.. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుందా..?

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలో నటించ‌డానికైనా.. ఎంత రిస్క్ చేయడానికి అయినా.. ముందు వరుసలో ఉండే నటినటులు, స్టార్ హీరోలు, హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఆయన ఎప్పటికప్పుడు అడ్వెంచరస్ రోల్స్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి పాత్రలోనే నటించి భారీ సక్సెస్‌లు అందుకున్న ఎన్టీఆర్.. ఒకానొక సందర్భంలో వరుస ప్లాప్స్ సైతం ఎదుర్కొని స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. మాస్ ఆడియన్స్‌ను ఆర‌ట్టుకోవాలని తారక్ చేసిన ప్రయత్నం కొన్ని సినిమాల్లో భారీ స్థాయి నష్టాలను తెచ్చి పెట్టింది. అలాంటి.. ఎన్టీఆర్ ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి క్రమంలో.. తారక్.. వార్ 2 సినిమాతో బిగ్‌ రిస్క్ చేస్తున్నాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్ ఎంట్రీ ఇవ్వబోతున్న మొట్టమొదటి సినిమా ఇది. ఈ సినిమా సక్సెస్ సాధించడం తారక్ కెరీర్ కు చాలా ముఖ్యం. సినిమాతో ఏమాత్రం నెగటివ్ టాక్ వచ్చినా.. ఖచ్చితంగా తారక్ కెరీర్, మార్కెట్ పై ప్రభావం పడుతుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కూడా లేదు.. దీంతో ఫ్యాన్స్‌లో కాస్త నిరాశ వ్యక్తం అవుతుంది. కాగా.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ.80 కోట్ల లెవెల్ లో బిజినెస్ జరగడం విశేషం. అంటే రూ.160 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తేనే టాలీవుడ్లో వార్ 2 బ్రేక్ ఈవెన్ అయినట్టు.

ఇక‌ కూలి సినిమాతో మ‌రోప‌క్క ఈ సినిమాకు గట్టి పోటీ ఉంది. ఇలాంటి క్రమంలో వార్ 2 కలెక్షన్ల పై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాత నాగ వంశీ వ్యవహరిస్తున్న క్రమంలో.. ఎన్టీఆర్ సినిమాలు విషయంలో వంశీ స్పెషల్ కేర్‌ తీసుకుంటాడనే నమ్మకం మాత్రం అభిమానుల్లో ఉంది. ఆగస్టు 14న వార్ 2 సినిమాకు సంబంధించిన రికార్డు లెవెల్ బెనిఫిట్ షోస్ టెలికాస్ట్ కానున్నాయి. బెనిఫిట్స్ తో పాజిటివ్ టాకీ వస్తే చాలు ఇక సినిమా సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుంది. కానీ.. ప్రజెంట్ టాలీవుడ్ లో తారక్‌కు భారీ మాస్ ఫ్యాన్ వేస్ ఉన్న క్రమంలో.. వాళ్ళు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు.. వార్ 2 సినిమాల్లో ఎన్టీఆర్ పాత్ర ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా.. లేదా.. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందా.. లేదా.. అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే.. ఎన్టీఆర్ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుకోవడం ఖాయమని.. ఈసారి వెయ్యి కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేస్తాడంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరి మూవీ రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.