కుబేర క్లోజింగ్ కలెక్షన్స్.. ధనుష్ సినిమాకు లాభమా.. నష్టమా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ , రష్మిక జంట‌గా నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. నాగార్జున కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. అమిగోస్ క్రియేష‌న్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి బ్యానర్లపై సంయుక్తంగా సునీల్ నారాయణ, పుష్కర్ రామ్మోహనరావు ప్రొడ్యూసర్లుగా తెరకెక్కించారు. ఇక ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఈ సినిమా.. బడ్జెట్, బ్రేక్ ఈవన్ టార్గెట్‌తో పాటు.. సినిమా క్లోజింగ్ కలెక్షన్స్.. ఎలాంటి లాభాలను కల్లగొట్టింది అనే అంశాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో అనగానే సినిమా పై ఆడియన్స్‌లో బ‌జ్ నెల‌కొంది. దానికి తగ్గట్టు నేషనల్ క్రష్‌ రష్మిక మందన ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై మరింత హైప్‌ మొదలైంది. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నాగార్జున ఈ సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు.

టీజర్, ట్రైలర్, ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు.. శేఖర్ కమ్ముల బ్రాండ్ ఇమేజ్‌తో సినిమాకు భారీ బ‌జ్‌ నెలకొంది. ఈ క్రమంలోనే నిర్మాణ విలువల పరంగాను ఎక్కడ తేడా రాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషన్ కార్యక్రమాలు ఇలా మొత్తంగా కలుపుకొని సినిమాకు రూ.145 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కుబేర ప్రీ రిలీజ్ బిజినెస్.. ఆంధ్ర రూ.33 కోట్లు, తమిళనాడులో రూ.18 కోట్లు, కర్ణాటక, మిగిలిన ఇండియా అంతటికి కలిపి రూ.5.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.8.5 కోట్ల చొప్పున మొత్తం వరల్డ్ వైడ్గా రూ.65 కోట్ల మేర‌ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ క్రమంలోనే సినిమాకు రూ.66 కోట్ల షేర్.. రూ..132 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తేనే సినిమా లాభాల్లోకి వెళ్తుందని ట్రేడ్ వర్గాలు వివరించాయి. ఇక‌ మొత్తంగా 16 రోజులకు ఇండియాలో కుబేర రూ.86.42 కోట్ల నెట్ వసూళ్లను, రూ.101 కోటి గ్రాస్ వ‌సుళ్ల‌ను దక్కించుకుంది. సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది.

Kubera Movie News

ఇప్పటివరకు రూ.30.5 కోట్ల వసూలు దక్కించుకున్న ఈ సినిమా.. ఇండియన్ గ్రాస్‌తో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా రూ.131 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. ఇక సినిమా లాభనష్టాల విషయానికి వస్తే.. జూన్ 12న గ్రాండ్‌గా రిలీజ్ అయిన కుబేర ఎక్కడా తగ్గకుండా.. కలెక్షన్‌ల‌తో దూసుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిన తమిళనాడులో డిజాస్టర్ అయింది. అక్కడ రూ.18 కోట్ల బిజినెస్ జరగగా.. రూ.40 కోట్ల గ్రాస్ రాబ‌టాల్సి ఉండగా.. రూ.20 కోట్లు మాత్రమే వసూళ్లు దక్కాయి. డిస్ట్రిబ్యూటర్లకు రూ.20 కోట్ల భారీ నష్టం జరిగింది. మిగిలిన ఏరియాలో థియేటర్ కలిపి కుబేర సినిమా ఓవరాల్ గా రూ.22 కోట్ల నష్టాలను తెచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఓవరాల్ బడ్జెట్, థియేట్రిక‌ల్, ఆడియో రైట్స్ అన్ని కలుపుకొని.. నష్టాలను తప్పుకొని నిర్మాత ఒడ్డున పడ్డాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఏరియాలో ఈ సినిమాను థియేటర్లో నుంచి తొలగిస్తుండగా.. ఈ వారంతరంలో క్లోజింగ్ కలెక్షన్స్ పై పూర్తి క్లారిటీ రానుంది. మరి ధనుష్, నాగార్జున ఫుల్ రన్ లో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో.. ఎన్ని కోట్లు రాబడతారో చూడాలి.