టాలీవుడ్ ను టార్గెట్ చేసిన ఈడి.. టాప్ సెలబ్రిటీలపై కేసులు..!

తెలుగులో భారీ బెట్టింగ్ యాప్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ స్కాంలో ఒకటైన బెట్టింగ్ యాప్ కు సంబంధించి ఈడీ దర్యాప్తుల ప్రారంభించింది. ప్రముఖ తెలుగు నటులు విజయ్ దేవరకొండ, రానా ద‌గ్గుపాట్టి, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, యాంకర్ శ్యామల, శ్రీముఖి, రీతు చౌదరి తదితరులపై ఈడీ కేసు నమోదయింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల ఎఫైఆర్‌ను బేస్ చేసుకుని ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. బెట్టింగ్ యాప్‌ల‌ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబ్‌లో సోషల్ మీడియాతో పాటు.. స్టార్ సెలబ్రిటీలు ఇప్పుడు మనీలాండరింగ్ చట్టాల కింద విచారణను ఎదుర్కొంటున్నారు.

ED Books 29 Tollywood Stars, Influencers for Promoting Illegal Betting Apps

ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌ల‌లో విష్ణు ప్రియ, నీతి అగర్వాల్, హర్షిని, సిరి హనుమంత్, వాసంతి కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాద‌వ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత తదితరుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్‌లో చేరాయి. పోలీసులు ఇప్పటికే 19 మంది యజమానులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యాప్లో జంగిల్ రమ్మీ, ర‌మ్మీ డాట్‌కాం, యోలో 247, ఏ 23, ఫెయిర్ ప్లే, జిత్, విన్ వి బుక్, తాజ్ 77, వీవి బుక్, ధని బుక్ 365, మామ 247, తెలుగు 365, ఎం 365, జై 365, జెడ్ ఎక్స్, పరి మ్యాచ్ ,తాజా సెవెన్, 77 బుక్, ఆంధ్ర 365 లాంటి యాప్స్ ఉన్నాయి. ఇక ఇప్పటికే ఇండియన్ హైకోర్టు సెక్షన్ 381(4), 112, రెడ్విత్‌ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3, 3(a), 4 , అలాగే ఐటీ చట్టం 201, సెక్షన్స్ 66d కింద కేసులు నమోదు అవుతున్నాయి.

ED Probes Telugu Stars in Betting App Scandal | The2States : Online  Breaking News, Latest News in English

ఈడి ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులకు నోటీసులు పంపించి స్టేట్మెంట్లు రికార్డు చేయడానికి సిద్ధమయింది. అయితే.. ఇప్పటికే ఈ వివాదంపై విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి టీమ్స్ రియాక్ట్ అయి.. క్లారిటీ ఇచ్చాయి. నిషేధిత బెట్టింగ్ యాప్‌ల‌ను మేము ఎప్పుడు ప్రచారం చేయలేదని చట్టబద్ధంగా అన్ని పర్మిషన్స్ ఉన్న నైపుణ్యాదారిత గేమింగ్ యాప్‌లనే ప్రచారం చేసామంటూ క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసిన ఏ 23 యాప్ ప్రచార ఒప్పందం ఇప్పటికే ముగిసిందని.. ఆ యాప్ తో మాకు ఎలాంటి సంబంధం లేదంటూ టీం క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. రానా దగ్గుపాటి టీం కూడా రియాక్ట్ అవుతూ తను ప్రమోట్ చేసిన ఓ యాప్ తో రానా ఒప్పందం 2017 లోనే పూర్తయిందని వివరించారు. మాకు అసలు సంబంధం లేదని.. అన్ని పర్మిషన్స్ ఉన్న యాప్‌ల‌నే మేము ప్రమోట్ చేసామని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌లు, సినీ నటులు హైదరాబాద్ పోలీసుల విచారణలో పాల్గొన్నారు. ఇక ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ ల కారణంగా ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న క్ర‌మంలో ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.