పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఆసక్తికరమైన రెండు బిగ్ అప్డేట్స్ ఒకేసారి వచ్చాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న హరి హర వీరమల్లు సినిమా జులై 24, 2025న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతుండగా, మరోవైపు ఓజీ టీజర్‌పై కూడా హైపే నెలకొంది. ఇవే కాకుండా, రెండు సినిమాల మధ్య సంబంధం ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్! వీరమల్లు రిలీజ్ ఖరారు!.. వీరమల్లు సినిమా గత రెండేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు అన్ని పనులు పూర్తిచేసుకొని జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ , జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ హాజరవుతారా? అన్నది అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది . ఓజీ టీజర్‌పై హైప్.. ఆగస్టులో సౌండ్ వస్తుందా? .. ఇక పవన్ అభిమానులు ఎక్కువగానే ఎదురుచూస్తున్న సినిమా ఓజీ. సాహో దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. పవన్ అభిమానులు కోరుకునే మాస్ మసాలా అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయట. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ క్రమంలో ఆగస్టు మొదటి లేదా రెండో వారం లో టీజర్ విడుదల చేయాలనే యోచనలో సుజీత్ ఉన్నట్లు సమాచారం.
అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ టీజర్‌ని వీరమల్లు రిలీజ్ సమయంలో థియేటర్లలో స్క్రీన్ చేయాలని కోరుకుంటున్నారు. పవన్ మూవీకి మరో పవన్ మూవీ టీజర్ అటాచ్ చేయడమేంటనే చర్చలు కూడా నడుస్తున్నాయి. కానీ ఇది ఓ రేంజ్ రెస్పాన్స్ తెస్తుందని అభిమానుల ధీమా. పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా..!? ఒకవైపు వీరమల్లు విడుదలతో థియేటర్ ఫెస్టివల్‌కు సిద్ధమవుతుంటే, మరోవైపు ఓజీ టీజర్ కూడా వస్తోంది. పవన్ ఫ్యాన్స్‌కు ఇది నిజమైన డబుల్ ధమాకా. గత కొన్నేళ్లుగా పాలిటిక్స్‌లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ వెండితెరపై ఫుల్ స్వింగ్‌తో కనిపించబోతున్నారు. ఇప్పుడు అభిమానుల్లో ఒక్కటే మాట – “సినిమా థియేటర్ మళ్ళీ పవన్ హంగామాతో దద్దరిల్లిపోవాలి!”