ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నేషనల్ లెవెల్‌లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మెరుపులు మెర్పిస్తూ.. సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అంతకంతకు రేంజ్ పెంచుకుంటూ గ్లోబల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు టాలీవుడ్ ధర్శకులు. ఈ క్రమంలోనే.. ఇప్పుడు టాలీవుడ్ కథల్లో సత్తా చాటుకునేందుకు పొరుగు ఇండస్ట్రీలో నుంచి సైతం హీరోలు, హీరోయిన్లు ఆసక్తి చూపుతూ.. స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించేందుకు ఆరాటపడుతున్నారు. ఓ మంచి కథ వస్తే చాలు.. కొత్త, పాత అని తేడా లేకుండా టాలీవుడ్ దర్శకులతో కలిసి సినిమాలు చేసేందుకు సై అంటున్నారు.
అలా.. తాజాగా రిలీజ్‌కు సిద్ధమైన మూవీ కుబేర. టాలీవుడ్ మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాపై.. ఇప్పటికే టాలీవుడ్ ఆడియన్స్ లోను పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. స్ట్రైట్ తెలుగు ఆడియన్స్‌లో సైతం.. పీక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాల్లో.. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో మెరవనున్న సంగతి తెలిసిందే. ఇక.. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కూడా భారీ లెవెల్‌లో పూర్తి చేసుకుంది. ఇక.. తాజాగా సెన్సార్‌ను పూర్తి చేసుకున్న టీమ్.. యూ\ఏ సర్టిఫికేట్తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే.. ధనుష్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న ఒకే ఒక్క అంశం రన్ టైం. మూడు గంటల రన్ టైంతో రూపొందుతున్న ఈ మూవీ ఆకట్టుకుంటే సరే సరి. కాస్త బోరింగ్ గా అనిపించినా.. సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుంది. బ్రేక్ ఈవెన్ కూడా కష్టతరమవుతుందని ఆందోళనలో ధనుష్ అభిమానులు ఉన్నారట. అయితే.. ధనుష్, కుబేర టీం మాత్రం.. ఈ సినిమాతో కచ్చితంగా నేషనల్ లెవెల్ లో సత్తా చాటుకోవడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక జూన్ 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.