విజయ్ పై ప్రేమను బయట పెట్టిన రష్మిక.. తనలో అన్నీ కావాలంటూ..!

టాలీవుడ్ నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన త్వరలోనే కుబేర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్ హీరోగా, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు నటించిన ఈ సినిమా ఈనెల 20న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నిన్న‌ హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో మూవీ టీం పాల్గొని సందడి చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఇక.. ఈవెంట్‌లో రష్మిక స్పెషల్ అట్రాక్షన్ అనడంలో అతిశయోక్తి లేదు. ధనుష్, రష్మిక హీరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడిగా కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌లో యాంకర్‌గా వ్యవహరించిన సుమ.. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు స్పందించింది. ఇందులో భాగంగా.. అడిగిన ఆసక్తికర ప్రశ్నలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Rashmika Mandanna Speech @ Kuberaa Movie Pre-Release Event

రాజమౌళి దగ్గరకు వెళ్లి ఆయన రెమ్యున‌రేషన్ గురించి అడిగి తెలుసుకున్న సుమ.. నెక్స్ట్ రష్మిక వద్దకు వెళ్ళింది. తను చెప్పే హీరోల నుంచి ఎవరి దగ్గర నుంచి ఏ క్వాలిటీస్ కాపీ చేస్తారు అంటూ ప్రశ్నించింది. ఇందులో భాగంగా.. సుమ నాగార్జున పేరు చెప్పగానే.. వెంటనే రష్మిక నాగార్జున నుంచి ఆయన ఆకర్షణ, ఆరా కాపీ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ధనుష్ నుంచి ఏ క్వాలిటీ అని అడగగా ధనుష్ గారు ఏదైనా చేసేయగలరు డైరెక్షన్, మ్యూజిక్, సింగింగ్, యాక్టింగ్ ప్రతి ఒక్కటి చేసేస్తారు. ఆ క్వాలిటీ కొట్టేస్తా అంటూ వివరించింది. ఇక సుమ.. అల్లు అర్జున్ పేరు చెప్పగానే ఆయన స్వాగ్‌ కాపీ చేస్తా అంటూ వివరించింది.

వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో పుష్ప వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక చివరిగా సుమ.. విజయ్ దేవరకొండ నుంచి ఏమి కాపీ చేయాలనుకుంటున్నా అని అడగగా.. ఒక్కసారిగా ఆడిటోరియం విజిల్స్ తో మూత మోగిపోయింది. రష్మిక కూడా.. విజయ్ పేరు చెప్పగానే మెలికలు తిరుగుతూ ప్రతి ఒక్కటి నేను కాపీ చేయాలనుకుంటున్న.. ఆయన నుంచి అన్ని తీసేసుకుంటా అంటూ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ పై రష్మిక మరోసారి తన ప్రేమను చూపించింది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారుతున్నాయి. ఇక‌ త్వరలోనే వీరిద్దరు ప్రేమ‌ను అఫీషియల్ గా ప్రకటించనున్నారు అని సమాచారం. ఇప్పటికే రష్మిక పలు సందర్భంలో తన లవ్‌ను పరోక్షంగా తెలియజేస్తూ వస్తుంది. ఇక తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది.