ప్రస్తుతం టాలీవుడ్‌లో అఖిల్ అక్కినేని, జైనబ్ వివాహం హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అఖిల్ కంటే వయసులో జైనబ్ ఏకంగా 8 ఏళ్లు పెద్దది అయినా వివాహం చేసుకోవడం అందరికీ షాక్ ను కలిగిస్తుంది. అయితే.. అఖిల్, జైనబ్‌ను వివాహం చేసుకోవడం వెనక ఓ సాలిడ్ రీజనే ఉందట. ఇంతకీ అసలు ఆ సాలిడ్ రీజన్ ఏంటి.. అసలు మేటర్ ఎంటో ఒకసారి తెలుసుకుందాం. సనాతన కాలం నుంచి భార్య కంటే.. భర్త పెద్దవాడై ఉండాలి. ఇది సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా.. భారతదేశంలో ఇలాంటి సాంప్రదాయాన్ని చాలా గొప్పగా పరిగణిస్తారు. భార్య భర్తల మధ్య ఐదేళ్ల గ్యాప్ కచ్చితంగా ఉండాలని భావిస్తారు. మారుతున్న సామాజిక సమీకరణలతో సాంప్రదాయాలు కూడా మెల్లమెల్లగా మసకభారిపోతున్నాయి. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీస్.. పెళ్లిలలో తమకంటే పెద్ద అమ్మాయిలను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు.
గతంలో మహేష్ బాబు, సచిన్ టెండూల్కర్‌తో పాటు.. ఎంతో మంది స్టార్స్ ఇలాగే తమకంటూ వయసులో పెద్దవాళ్లయిన అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. తాజాగా.. అఖిల్ అదే లిస్టులోకి చేరాడు. నాగార్జున చిన్న తనయుడు అఖిల్.. జైనబ్‌ను గ్రాండ్ లెవెల్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన జైనబ్ వయసులో అఖిల్ కంటే.. ఎనిమిది ఏళ్లు పెద్దది. అఖిల్ వయసు 31 కాగా.. జైనబ్ వయసు 39 సంవత్సరాలట. దీన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య ఇంచుమించు దశాబ్దం గ్యాప్ ఉంది. ఈ పరిణామం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అఖిల్ కంటే అంత పెద్ద అమ్మాయిని కోడలుగా నాగార్జున ఎలా ఒప్పుకున్నాడు.
వెనకున్న వేలకోట్ల ఆస్తుల వల్ల..? వ్యాపార సామ్రాజ్యాన్ని చూశా..? నాగార్జునకు విలువల కంటే డబ్బులే ఎక్కువా..? అంటూ.. రకరకాల విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదట. వయసులో తనకంటే పెద్దదైన జైనబ్‌ను అఖిల్ పెళ్లి చేసుకోవడం వెనుక ఓ బలమైన రీజన్ ఉందట. అదేంటంటే.. జైనబ్‌ను చూసి అఖిల్ ఆమెను ప్రేమించడమే. ఇక జైనబ్ ముస్లిం అమ్మాయి. ఆమె తండ్రి జుల్ఫీ రావిడ్జ్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్. అలా జల్ఫీ, నాగార్జున ఫ్యామిలీల మధ్య ఎప్పటినుంచో సాన్నిహిత్య ఉంది. ఈ క్రమంలోనే జైనబ్ తో అఖిల్‌కు పరిచయం ఏర్పడడం.. వాళ్ళ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో దాదాపు మూడేళ్ల పాటు ప్రేమను కొనసాగించిన ఈ జంట తాజాగా కుటుంబ అంగీకారంతో వివాహం చేసుకున్నారు.