మాస్ మహారాజు రవితేజ టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. ఎన్నో అవమానాలు, ఇబ్బందుల తర్వాత హీరో ఛాన్స్ కొట్టేశారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. హీరోగా అవకాశం దక్కించుకున్న తర్వాత.. తను నటనతో సత్తా చాటుకుని వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ వరుస బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేపసుకున్నాడు. మాస్ మహారాజ్ ఇమేజ్‌తో రాణించాడు. అయితే.. ప్రస్తుతం ఆయన టైం బాగోలేదని చెప్పాలి. ప్రస్తుతం రవితేజ కెరీర్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. కంప్లీట్.. రొటీన్ స్టోరీలను ఎంచుకుంటూ అభిమానులను మెప్పించలేక డీల పడిపోతున్నారు. ఒకప్పుడు ఆయన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో అదిరిపోయే కంటెంట్‌తో సూపర్ హిట్లు అందుకున్న రవితేజ.. ఇటీవల కథపై పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏ సినిమా వచ్చినా పర్లేదని చేసుకుంటూ పోతున్నారు తప్ప.. కంటెంట్ ఉందా, లేదా అనేది ఆలోచించడం లేదని.. ఈ క్రమంలోనే ఫ్లాప్స్ తప్పడం లేదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈయన సినీ కెరీర్‌లో వరుస బ్లాక్ బస్టర్‌లతో పాటు.. డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. కాగా.. రవితేజ కెరీర్‌లో.. గతంలో వచ్చిన క్రాక్ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. వెంటనే వచ్చిన ఖిలాడి మూవీ డిజాస్టర్. ఖిలాడి సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరైరన మీనాక్షి చౌదరి ఈ సినిమాలో రవితేజ తో లిప్ లాక్ సీన్లో నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సీన్‌కు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలో అసలు లిప్‌లాక్ సీన్ అవసరమే ఉండదట. రవితేజ స్వయంగా డైరెక్టర్‌ను అడిగిమరీ ఈ సీన్ రాయించాడంటూ టాక్ తెగ వైరల్ గా మారింది.
ఈ విషయం రవితేజ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే రవితేజతో పని చేసిన దర్శకులు ఎంతోమంది ఆయన పెద్దగా కథలో వేలుపెట్టడని.. దర్శకులకు అసలు ఫ్రీ సజెషన్స్ ఇవ్వరని.. దర్శకుడు ఏది చెప్తే అదే వింటారంటూ అభిప్రాయాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాంటిది అడిగిమరీ లిప్ లాక్ సీన్ పెట్టించుకోవడం అసాధ్యం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఈ సినిమా తర్వాత మీనాక్షి చౌదరి కెరీర్ మాత్రం ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ బ్లాక్ బస్టర్లు అందుకుంటుంది మీనాక్షి.