మలయాళ స్టార్ నటుడిగా తిరుగుడానికి క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఓ లెవెల్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటే.. ఇకపై రానున్న సినిమాల విషయంలో మరో లెవెల్లో ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా.. తెలుగులో లక్కీ భాస్కర్ సినిమాతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న దుల్కర్.. ఇకపై నటించబోయే సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ప్రస్తుతం తెలుగులో కూడా కొన్ని సినిమాలకు కమిట్ అయిన దుల్కర్.. వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సంకల్పంతో ఉన్నాడు. ఇక మమ్ముట్టి తనయుడిగా నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దుల్కర్.. 100% ఎఫర్స్‌తో తన నటనతో పాత్రలకు ప్రాణం పోస్తున్నాడు. ఎలాంటి పాత్రనైనా అలవోకగా నటిస్తూ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్‌లో సల్మాన్ ఫేవరెట్ హీరో ఎవరు అని ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
ఇదిలా ఉంటే తాజాగా దుల్కర్ ఓ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు టాలీవుడ్‌లో ఇష్టమైన హీరో చిరంజీవి అని.. ఆయన చాలా సినిమాలను ఇప్పటికే చూశాను అంటూ వెల్లడించాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న దుల్కర్ సల్మాన్.. ఫ్యూచర్లో టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం వస్తే.. మల్టీ స్టారర్ చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నానంటూ అభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దుల్కర్‌ను అభిమానించే టాలీవుడ్ అభిమానులు.. మన స్టార్ హీరోలతో దుల్కర్ మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.