పుష్ప 2 సూపర్ హిట్‌కు బాలయ్యకు లింక్ ఏంటి.. అలా ఎలా..?

నంద‌మూరి న‌ట‌సింహం.. బాలకృష్ణకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య గత కొంతకాలంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాపై అన్‌స్టాప‌బుల్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్య.. బుల్లితెర ఆడియన్స్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఈ టాక్ షోకు సంబంధించిన మూడు సీజ‌న్‌లు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇక కొన్ని రోజుల క్రితమే అన్‌స్టాప‌బుల్ నాలుగవ‌ సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

For Whom Did Allu Arjun Buy Liquor Bottle in Goa? | For Whom Did Allu Arjun  Buy Liquor Bottle in Goa?

ఇక ఈ సీజన్‌లో రిలీజ్ కానున్న త‌మ మూవీ ప్రమోషన్ల కోసం కూడా కొన్ని మూవీ టీమ్స్ హాజరై సందడి చేశాయి. అందులో భాగంగా కొంతకాలం క్రితం దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ.. లక్కీ భాస్కర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చి సందడి చేశారు. ఇక లక్కీ భాస్కర్ సినిమా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. ఇదిలా ఉంటే కొంతకాలం క్రితం బ‌న్నీ కూడా పుష్ప2 ప్రమోషన్స్‌లో భాగంగా హాజరయ్యాడు.

తాజాగా అయిన నటించిన పుష్ప 2 మూవీ థియేటర్లలో రిలీజ్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్టర్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్ స్టాపబుల్‌ సీజన్ 4కు గెస్ట్ గా వస్తున్న హీరోల సినిమాలన్నీ స‌క్స‌స్‌ అందుకుంటున్న క్రమంలో.. పుష్ప పార్ట్ 2 సినిమా సక్సెస్ కు కూడా బాలయ్య సెంటిమెంట్ కారణం అని.. బాలయ్య వ‌ల్లే పుష్ప 2 బ్లాక్ బ‌స్టర్ అయిందంటూ బాలయ్య అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.