అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప దీ రూల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొంది మంచి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో ఈ సినిమా ఆడుతున్న క్రమంలో థియేటర్‌లో అనూహ్య సంఘటన జరిగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి థియేటర్లో ఘాటైన స్ప్రే కొట్టడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి బాంధ్రాలోని ఓ థియేటర్లో సెకండ్ షో ప్రదర్శితం అవుతున్న టైం ఈ సంఘటన జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి స్ప్రే కొట్టడంతో ప్రేక్షకులంతా దగ్గులు, వాంతులుతో సతమతమైపోయారు.
ఇక థియేటర్ యాజమాన్యం కాసేపు షో ఆపేసి.. పోలీసులకు డీటెయిల్స్ అందించారు. హాల్‌కు చేరుకున్న పోలీసులు ప్రతి ఒక్కరిని సెర్చ్ చేయగా.. ఇంటర్వల్ టైంలో బయటకు వచ్చి తిరిగి లోపలికి వెళ్లిన తర్వాత అందరికీ దగ్గులు ప్రారంభమయ్యాయని.. తెలిసింది. ఆడియన్స్ మీడియా ముందు ఇదే విషయాని వెల్లడించారు. కొందరికి వాంతులు కూడా అయినట్లు చెప్పుకొచ్చారు. పోలీసులు వచ్చి సెర్చింగ్ పూర్తిచేసిన 20 నిమిషాలకు సినిమా తిరిగి ప్రారంభమైంది. అయితే.. థియేటర్‌లలో ఆ స్ప్రేనే ఎవరు చల్లారు.. అసలు దానికి కారణం ఏంటనే.. విషయాలు ఇంకా తెలిసి రాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి.
ఇక మరోపక్క హైదరాబాద్ సంధ్య థియేటర్లో బెనిఫిట్‌షో తర్వాత తొక్కేసినట్లు జరిగిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ మూవీ చూసేందుకు రావడంతో.. ఆయన సినిమా చూసి వెళ్ళిపోతున్న సమయంలో.. బన్నీని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో.. రేవతి అనే మహిళతో పాటు, తన కుమారుడు శ్రీ తేజ (9) కింద పడిపోయి జనం కాళ్ళ మధ్యన నలిగిపోయారు. దీంతో స్పృహ కోల్పోగా.. వెంటనే సిఆర్పి చేసి స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చికిత్స పొందుతూ రేవతి చనిపోగా.. బాలుడికి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై నిర్మాణ సంస్థ స్పందిస్తూ.. కుటుంబానికి అండగా ఉంటామంటూ పోస్ట్ ను రిలీజ్ చేసింది.