బన్నీ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ పుష్ప ది రూల్. మోస్ట్ అవైటెడ్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫ్రీ బుకింగ్స్‌లోనే తన హవా చూపించిన పుష్పరాజ్.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల వాసుళ్ళను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ సినిమా కలెక్షన్లలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్‌లు ఎక్కువగా ఉన్నాయని టాక్. అమెరికాలో ఈ సినిమా మొదటి రోజే ఏకంగా 4.2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టడం విశేషం.
ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. అంతేకాదు.. ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా దీనిని షేర్ చేసుకున్నారు. అమెరికాలో ఈ రేంజ్ వసూలు సాధించిన మూడో ఇండియన్ సినిమాగా పుష్ప2 గనత సాధించిందని మేకర్స్ వెల్లడించారు. ఇక పుష్ప ది రూల్.. ఫస్ట్ డే కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేశాయి. ఈ సినిమా.. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు అంతకుమించి కలెక్షన్లు వస్తాయని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ.. సెకండ్ ఓపెనింగ్స్ పూర్తి భిన్నంగా మారిపోయాయి.
పుష్ప 2 బుకింగ్స్.. సగానికి పడిపోయాయంటూ వార్త నెటింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇది బన్నీ ఫ్యాన్స్ నిరాశ కల్పిస్తుంది. ఇక ఈ సినిమా కోసం సుకుమార్ ఎంతగానో కష్టపడ్డాడు. ఆయన డైరెక్షన్, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంది. మూడు గంటల నడివితో ఈ సినిమా రూపొందింది. ఇక టీజర్, ట్రైలర్తో మంచి హైట్ ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా నుంచి కొన్ని మేజర్ సీన్లు తీసేసారని.. అందుకే రెండో రోజు కలెక్షన్ దారుణంగా పడిపోయాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మూడవరోజు కలెక్షన్స్ అయినా పుంజుకుంటాయో లేదో వేచి చూడాలి.