టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ పుష్ప 2. ప్రస్తుతం పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ డే భారీ స్థాయిలో కలెక్షన్లను కల్లగొట్టిన ఈ సినిమా.. ఒక ఓవర్సీస్‌లోనే 4.5 మిలియన్ డాలర్లను సంపాదించి ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే పుష్పట్టు రికార్డుల వసూళ్ళు వరల్డ్ వైడ్‌గా.. ఒకదాని తర్వాత ఒకటి రిలీజై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. అలా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఓపెనింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
ఇక నైజాం ఏరియా నందమూరి హీరోల అడ్డగా వారి సినిమాలకు క్యారఫర్ డ్రెస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాంటి ఏరియాలో ఫస్ట్ డే కలెక్షన్ తో పుష్ప రాజ్ తన సత్తా చాటుకున్నాడు. నైజాం మార్కెట్‌లో భారీ ఓపెనింగ్స్‌ను సాధించి.. ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. తాజాగా.. వచ్చిన పిఆర్ లెక్కల ప్రకారం పుష్ప 2 ఒక్క నైజాం ఏరియాలోనే.. ఏకంగా రూ.25 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. అది కూడా ఫస్ట్ డే లోనే ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం నిజంగా రికార్డు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. గతంలో ఉన్న అన్ని సినిమాల రికార్డులను కూడా పుష్పరాజ్ బ్రేక్ చేశాడు.
ఈ సినిమాతో మిగతా సినిమాలకు ఆల్ టైం రికార్డ్ అందుకోడమే కాదు.. రాబోయే సినిమాలకు సాలిడ్ మార్జిన్ కూడా ఏర్పడింది. ఇలాంటి క్రమంలో.. ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్స్ చూసి పుష్ప 2 సెకండ్ డే కలెక్షన్స్ మరింత పెరుగుతాయని.. ట్రేడ్ వర్గాల అంచనాలు వేశాయి. కానీ.. అనుకున్న దానికి భిన్నంగా పుష్ప 2 సెకండ్ డే కలెక్షన్స్.. సగానికి పడిపోయాయి అంటూ ఓ వార్త నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ క్రమంలోనే సెకండ్ డే నుంచి.. వీకెండ్ వరకు నైజంలో బుకింగ్స్ ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో.. లేదా ఫస్ట్ డే కలెక్షన్స్ రేంజ్‌లోనే కలెక్షన్‌లు వసూలు చేస్తుందా అనే సందేహాలు అభిమానులలో నెటకొన్నాయి. ఇక నైజంలో ముఏదుముందు ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుందో వేచి చూడాలి.