తాజాగా తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై హైదరాబాద్‌లో బెనిఫిట్‌షోలు రద్దు చేశారు. ఇటీవల హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద బెనిఫిట్ షో తర్వాత పుష్ప 2 తొక్కీసులాటలో రేవతి అనే మహిళ చనిపోవడం.. బాలుడికి క్రిటికల్‌గా ఉండడంతో ఇకపై బెనిఫిట్ షోలు రద్దు చేయాలని.. తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే దీనిపై కొందరు రియాక్ట్ అవుతూ.. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరుచుకున్నందుకు సంతోషం.. ఇదే మాటపై ఉంటే బాగుంటుంది. నిజంగానే హైదరాబాద్ వాళ్ళపై ప్రేమ ఉంటే.. మరిన్ని చర్యలు తీసుకోవాలి. ఇంకొన్ని మార్చాలి అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు జనం.
ద్వేషాలు, విభేదాలు, సంకోచాలనేవి లేకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు అనుమతులు ఇవ్వకుండా ఉంటే మంచిదని.. బందోబస్తులకు వంద మంది పోలీసులను అపాయింట్ చేయడమేంటి.. సినిమా అనేది ఒక వ్యాపారం. ఇక దానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాడి స్వార్థం కోసం, వాటి ప్రమోషన్ల కోసం, ఎలా పడితే అలా మీటింగ్ పెట్టేసి.. భారీ జన సందేహాన్ని పోగు చేసి హంగామా చేసేసి.. మిగతా సిటిజనులకు ట్రాఫిక్ కష్టాలు తెస్తుంటే అది సరైన పద్ధతి కాదు. అభిమానం ఉన్మాదంగా మారితే లా అండ్ ఆర్డర్ కే సమస్య వస్తుంది. గతంలో ఓ బిగ్ బాస్ వినార్ ఊరేగింపులోను ఇలాంటి వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. ఆ కేసు ఏం అయిందో ఎవరికి తెలియదు. ఇక ఆ కంటెస్టెంట్ వల్ల ఎవరికి ఏం యూజ్ కూడా లేదు.
అసలు సినీ ఇండస్ట్రీ.. సైకో ఫ్యాన్స్ మరింత వైలెంట్‌గా తయారవుతుంది. నాలుగు గోడల మధ్య ఏదైనా హోటల్ లో పరిమిత సంఖ్యలో, మీడియా అతిధుల సమక్షంలో ఈవెంట్లు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటే సరే సరి. బహిరంగ సినీ ఫంక్షన్స్ అసలు అవసరేమేముంది. పరిస్థితి అదుపు తప్పితే నిర్వాహకులు చేతులెత్తేయాల్సి ఉంటుంది. సో కాల్డ్ స్టార్ హీరోలకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ లోపిస్తే.. పరిస్థితి అదుపుతప్పినప్పుడు నిర్వాహకులు కూడా చేతులెత్తే పరిస్థితి నెలకొంటుంది. సో ఇలాంటి వాటిపై కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలని.. ఇకపై ఇలాంటి ఈవెంట్లు, మీటింగ్లు పరిమితితో చేస్తే బాగుంటుందని.. బెనిఫిట్‌షోలు మాత్రమే కాకుండా.. ఇష్టారాజ్యంగా పెడుతున్న ప్రీమియర్ షోలు, అడ్డగోలు టైమింగ్స్, టికెట్ల రేట్ల పెంపు ఇలాంటి వాటిని కూడా అదుపులో ఉంచి సాధారణ ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే సినిమాను చూసే విధంగా నిబంధనలు పెడితే బాగుంటుందని.. పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.